ETV Bharat / sitara

Puneeth Rajkumar news: టాలీవుడ్​తో పునీత్​కు ఎనలేని 'బంధం' - puneeth rajkumar news kannada

కన్నడ పవర్​ స్టార్​ పునీత్​ రాజ్​కుమార్​కు తెలుగుతో ప్రత్యేక అనుబంధం ఉంది. హీరోగా ఆయన తొలి సినిమా టాలీవుడ్​ ప్రముఖ డైరెక్టర్​ పూరీ జగన్నాథ్​. ఆ సినిమానే తెలుగులో ఇడియట్​గా విడుదలైంది. పునీత్​ చేసిన పలు చిత్రాలు తెలుగులో రీమేక్​, డబ్​ అయ్యాయి. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, రెడీ, దూకుడుతో పాటు మరికొన్ని చిత్రాలను కన్నడలో ఆయన రీమేక్​ చేసి ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు.

puneeth rajkumar news
పునీత్
author img

By

Published : Oct 30, 2021, 12:29 PM IST

పునీత్​ రాజ్​కుమార్​ హఠాన్మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు మిగిల్చింది. తన నటన, వ్యక్తిత్వంతో మన్ననలు పొందిన పునీత్​.. ఇక లేరనే విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే పునీత్​ కేవలం కన్నడ చిత్రపరిశ్రమకే పరిమితం కాదు. తెలుగుతోనూ ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. హీరోగా ఆయన మొదటి సినిమా దర్శకుడు.. మన టాలీవుడ్​కు చెందిన పూరీ జగన్నాథ్​.

  • పునీత్​ రాజ్​కుమార్​ తొలి సినిమా 'అప్పు'. తెలుగులో అప్పటికే మంచి గుర్తింపు పొందిన పూరీ జగన్నాథ్​.. ఈ చిత్ర దర్శకుడు. అప్పట్లో ఈ సినిమా ఓ సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత ఈ సినిమాను నాలుగు భాషల్లో తెరకెక్కించగా.. అన్నింటా సూపర్​ హిట్​ అయ్యింది. ముఖ్యంగా అప్పు, ఇడియట్​ను​ (తెలుగులో రవితేజ హీరో) ఏకకాలంలో తీసి బ్లాక్​బస్టర్​ కొట్టారు పూరీ. 2002 ఏప్రిల్​లో అప్పు విడుదల కాగా.. అదే ఏడాది ఆగస్టులో ఇడియట్​ థియేటర్లలోకి వచ్చింది.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • 2003లో 'అభి' చిత్రంతో మరో హిట్​ కొట్టారు పునీత్​. ఈ సినిమా దర్శకుడు దినేశ్​ బాబు. ప్రముఖ నటి రమ్య ఈ చిత్రంతోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. దిగ్గజ నటుడు రాజ్​కుమార్​ ఈ సినిమాలో ఓ పాట కూడా పాడారు. మరో విశేషం ఏంటంటే.. ఇదే సినిమా 'అభిమన్యు'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి కల్యాణ్​ రామ్​ హీరో.
  • 2004లో 'వీర కన్నడిగ'గా ప్రేక్షకుల ముందుకొచ్చారు పునీత్​. తెలుగులో జూనియర్​ ఎన్టీఆర్​​ నటించిన 'ఆంధ్రావాలా'నే ఈ వీర కన్నడిగ. రెండు చిత్రాలు ఏకకాలంలో షూటింగ్​ జరుపుకున్నాయి. అయితే వీర కన్నడిగాకు మెహర్​ రమేశ్​ దర్శకత్వం వహించారు.
  • 2003లో పూరీ జగన్నాథ్​ తెలుగులో తీసిన 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' సూపర్​ హిట్​ టాక్​ సొంతం చేసుకుంది. ఈ సినిమాను 2004లో రీమేక్​ చేసి 'మౌర్య'తో హిట్​ కొట్టారు పునీత్​. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి మీరా జాస్మిన్​.. ఈ సినిమాతో కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టారు.
  • తెలుగులో ప్రముఖ రచయిత జనార్థన్​ మహర్షి అందించిన కథతో 2005లో 'ఆకాశ్​' చిత్రంతో ప్రేక్షకులను అలరించారు పునీత్​. ఈ సినిమాలో హీరోయిన్​గా రమ్య కనిపించారు.
    puneeth rajkumar news
    బాలకష్ణతో పునీత్​ రాజ్​కుమార్​
  • 2004లో తెలుగులో పవన్​ కళ్యాణ్​తో గుడుంబా శంకర్​ తీసిన వీర శంకర బైరిశెట్టితో ఆ వెంటనే ఓ సినిమా చేశారు పునీత్​. 'నమ్మ బసవ' పేరుతో 2005లో ఈ చిత్రం విడుదలైంది.
  • 2006లో 'అజయ్'​తో మరో బ్లాక్​బస్టర్​ కొట్టారు పునీత్​. అది తెలుగులో వచ్చిన 'ఒక్కడు'కు రీమేక్​. అజయ్​ను మెహర్​ రమేశ్​ తెరకెక్కించారు.
  • 2008లో తెలుగులో సూపర్​ హిట్​ కొట్టిన రెడీ చిత్రం.. 2009లో 'రామ్​' పేరుతో కన్నడలో విడుదలైంది. ఆ చిత్రంలో పునీత్​ రాజ్​కుమార్​- ప్రియమణి నటించారు. కన్నడ సినిమాలో ప్రియమణికి అదే తొలి అవకాశం.
  • తెలుగులో పవన్​ కళ్యాణ్​తో తీన్​మార్​ తీసిన జయంత్​ సీ పరాన్జీ.. 2014లో పునీత్​తో 'నినిందలె' తెరకెక్కించారు. ఆయనకు కన్నడ పరిశ్రమలో అదే తొలి చిత్రం.
  • కొన్నేళ్ల విరామంతో 2011లో 'దూకుడు'తో తిరిగొచ్చి ఇండస్ట్రీ హిట్​ కొట్టారు మహేశ్​ బాబు. ఈ చిత్రాన్ని 2014లో 'పవర్​' పేరుతో రీమేక్​ చేశారు పునీత్​. తెలుగులో నిర్మాతలుగా వ్యవహరించిన రామ్​, గోపి అచంటలే అక్కడా సినిమాని తీశారు. త్రిష కథానాయిక.

  • తెలుగు స్టార్​ మ్యూజిక్​ డైరెక్టర్​.. ఎస్​ఎస్​ తమన్​.. 2016లో పునీత్​ హిరోగా వచ్చిన 'చక్రవ్యూహ'కు సంగీతం అందించారు. ఈ సినిమాలో 'గెలయా గెలయా' పాట పాడింది జూనియర్​ ఎన్టీఆర్​​. అప్పట్లో ఈ పాట యువతలో మంచి క్రేజ్​ సంపాదించుకుంది.

  • పునీత్​ రాజ్​కుమార్​ చివరి చిత్రం 'యువరత్న' ఈ ఏడాది ఏప్రిల్​లో విడుదలైంది. ఈ సినిమాకు తమన్​ సంగీతం అందించారు. ఈ సినిమా అదే పేరుతో తెలుగులోనూ డబ్​ అయ్యింది.

శుక్రవారం ఉదయం జిమ్​లో వ్యాయామం చేస్తున్న సమయంలో పునీత్ రాజ్​కుమార్​కు గుండెపోటు వచ్చింది. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ పునీత్​ ప్రాణాలను వైద్యులు కాపాడలేకపోయారు. కన్నడ పవర్​ స్టార్​ మృతి పట్ల పలువురు నటీనటులు, అభిమానులు సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.