ETV Bharat / sitara

Punith rajkumar death: 10 మంది పునీత్ ఫ్యాన్స్ మృతి, ఒకరు ఆస్పత్రిలో - పునీత్ రాజ్​కుమార్ లేటెస్ట్ న్యూస్

పునీత్​ మరణాన్ని తట్టుకోలేక ఫ్యాన్స్​ తుదిశ్వాస విడుస్తున్నారు. కొందరు ఉరి వేసుకుని, మరికొందరు గుండెపోటుతో మరణించారు. మరో అభిమాని ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నాడు.

Puneeth Rajkumar
పునీత్ రాజ్​కుమార్
author img

By

Published : Oct 31, 2021, 7:54 AM IST

కన్నడ పవర్​స్టార్ పునీత్​ రాజ్​కుమార్ హఠాన్మరణం చాలామందిని షాక్​కు గురిచేసింది. పలువురు నటీనటులతో పాటు ప్రజలు, అభిమానులు చాలా బాధపడుతున్నారు. ఈయన మృతిని తట్టుకోలేక కర్ణాటకకు చెందిన ఆరుగురు ఫ్యాన్స్​ మరణించగా, మరో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మరో అభిమానికి గుండెపోటు రావడం వల్ల అతడిని ఆస్పత్రిలో చేర్చారు.

  • బెల్గావి జిల్లాలోని అతనీ నగరానికి చెందిన రాహుల్(22).. పునీత్​ ఫొటో ముందే ఉరి వేసుకుని శనివారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. చిక్కుమగళూరు చెందిన శరత్(30) కూడా ఉరి వేసుకుని మృతిచెందారు.
    .
    .
  • సింధోలి గ్రామానికి చెందిన పరశురామ హనుమంత(33).. పునీత్ మరణవార్త విని గుండెపోటుతో శనివారం ఉదయం మరణించారు. మరూర్​ గ్రామానికి చెందిన మునియప్ప(28) రైతు. మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వచ్చిన అతడు.. పునీత్ మరణవార్తను టీవీలో చూసి తట్టుకోలేకపోయాడు. గుండెపోటుతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
    .
    .
  • హోన్నూర్ గ్రామానికి చెందిన గణేశ్(22).. పునీత్ కన్నుమూతను జీర్ణించుకోలేకపోయాడు. దీంతో బ్లేడ్​తో చేయి కోసుకుని మృతి చెందాడు.
  • రాయ్​చూర్ జిల్లాకు చెందిన బసవన్నగౌడ(28), మహమ్మద్ రఫీ(28).. పునీత్ ఇక లేరన్న విషయాన్ని నమ్మలేకపోయారు. దీంతో ఆత్మహత్య చేసుకుని మరణించారు. విజయపురకు చెందిన శరనప్ప బిసనల్(24).. డయాబెటిస్ టాబ్లెట్స్​ ఎక్కువ మోతాదులో తీసుకుని ప్రాణాలు వదిలాడు.
    .
    .
  • మండ్యలోని ఎలదహల్లి గ్రామానికి చెందిన వైఎస్ సురేశ్(45).. పునీత్ మరణవార్తను టీవీలో చూస్తూ గుండెపోటుతో చనిపోయారు.
  • మైసూర్​ కేఆర్ నగర్​కు చెందిన ఆటో డ్రైవర్ అశోక్(40) పునీత్ మరణంతో మానసికంగా కలత చెందారు. దీంతో కాలువలో దూకి తన ప్రాణాలు వదిలేశారు.
  • చిక్కమగళూరుకు చెందిన ప్రో-కన్నడ తాలుకా ప్రెసిడెంట్​ ఆదిమూర్తి రెడ్డికి గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆస్ప్రత్రిలో ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.