తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్కు తన రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఎక్కువైందని అన్నారు. సినీ పరిశ్రమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఇటీవల సినీ పరిశ్రమలో టికెట్ ధరల అంశంపై సీఎం జగన్తో సినీ పెద్దల వ్యవహారం సరైన విధంగా లేదని సి.కల్యాణ్ అన్నారు. సినిమా వ్యాపారంలో రాజకీయ జోక్యం తగదని అభిప్రాయపడ్డారు.
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి అగ్ర నటులు జోక్యం చేసుకుని ఈ వివాదానికి ముగింపు పలకాలని సి.కళ్యాణ్ డిమాండ్ చేశారు. సినిమా టికెట్లను సినిమా వాళ్లే అమ్ముకునేలా చొరవ చూపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: