Priyanka chopra surrogacy: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గుడ్‌న్యూస్ చెప్పింది. సరోగసీ విధానం ద్వారా బిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించింది. ఈ సమయంలో తమకు ప్రైవసీ ఇవ్వాలని అభిమానుల్ని కోరింది. 2018లో ఈమె అమెరికన్ పాప్ సింగర్ నిక్ జొనాస్‌ను పెళ్లి చేసుకుంది.
ఈ జనవరిలో ప్రియాంక ఇచ్చిన ఇంటర్వ్యూలో పిల్లల గురించి అడగ్గా ఆసక్తికర సమాధానమిచ్చింది. పిల్లలు, కెరీర్‌ను తను బ్యాలెన్స్ చేసుకోగలనని చెప్పింది.
ప్రియాంక నటించిన 'ద మ్యాట్రిక్ 4' సినిమా గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈమె నటించిన హిందీ సినిమా 'ద వైట్ టైగర్'.. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ప్రస్తుతం 'సిటాడెల్' అనే టీవీ షోలో నటిస్తోంది. 'టెక్స్ట్ ఫర్ యూ' సినిమాలోనూ నటిస్తూ ప్రియాంక బిజీగా ఉంది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చదవండి: