ETV Bharat / sitara

'కేజీఎఫ్​'ను మించిపోయేలా ప్రభాస్ 'సలార్​'! - ప్రభాస్​ ప్రశాంత్​ నీల్​

ప్రభాస్ 'సలార్'.. 'కేజీఎఫ్​'ను మించిపోయేలా ఉంటుందని అంటున్నారు. అందుకు తగ్గట్లే ఎక్కడా రాజీ పడకుండా సినిమా తీస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్​కు పండగే.

Prabhas's 'Salaar' will be twice as big as KGF: Reports
'కేజీఎఫ్​'కు రెండింతలు ఎక్కువగా 'సలార్​'
author img

By

Published : Aug 20, 2021, 9:32 AM IST

'కేజీఎఫ్​' చిత్రంతో హీరోయిజాన్ని మరో స్థాయిలో చూపించారు దర్శకుడు ప్రశాంత్​ నీల్​. హీరో యశ్​కు ఎలివేషన్స్​ ఇవ్వడం సహా భారీ ప్రొడక్షన్​ వాల్యూతో రూపొందించిన సినిమా ఇది. ఇప్పుడు దానికి రెండింతలు ఎక్కువ యాక్షన్​, ఎలివేషన్స్​తో 'సలార్​' చిత్రాన్ని తీస్తున్నారట.

పాన్​ఇండియా స్టార్​ ప్రభాస్​ హీరోగా ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా సలార్.​ ఇప్పుడు దీనిని భారతీయ చిత్రసీమలో కనివిని ఎరుగని రీతిలో భారీ స్థాయిలో రూపొందిస్తున్నారట. నిర్మాతలు కూడా ఏ విషయంలోనూ రాజీ పడటం లేదని ప్రచారం సాగుతోంది. దీంతో ప్రేక్షకులు, అభిమానులకు 'కేజీఎఫ్​'ను మించిన డబుల్​ ట్రీట్​ ఇవ్వనున్నామని చిత్రబృందం ధీమాగా ఉంది. ఇటీవలే మొదలైన సినిమా రెండో షెడ్యూల్​ పూర్తయ్యిందని తెలుస్తోంది. వచ్చే నెలలో మూడో షెడ్యూల్​ను ప్రారంభించనున్నారు.

'సలార్​' చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో రూపొందించడం సహా పాన్​ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంతోనే కన్నడలోకి ప్రభాస్​ అరంగేట్రం చేయనున్నారు. 'కేజీఎఫ్​' ఫేమ్​ రవి బస్రూర్​ సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ నటుడు మధు గురుస్వామి కీలకపాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

ఇదీ చూడండి.. అందం కోసం దాని మాటే వింటా: అదితీరావ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.