ETV Bharat / sitara

అంతలోనే పవన్​ కల్యాణ్ లుక్​లో ఎంత మార్పు! - పవన్ వకీల్​సాబ్

ఇటీవల కాలంలో గడ్డం​తో దర్శనమిచ్చిన పవన్.. 'వకీల్​సాబ్' షూటింగ్ కోసం ట్రిమ్​ లుక్​లో కనిపించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్​ మెట్రోలో గురువారం ప్రయాణించి ప్రజల్ని పలకరించారు.

power star pawan kalyan in hyderbad metro
పవన్​ కల్యాణ్
author img

By

Published : Nov 5, 2020, 1:57 PM IST

Updated : Nov 5, 2020, 5:33 PM IST

పవర్​స్టార్ పవన్​ కల్యాణ్​ కేవలం రోజుల వ్యవధిలోనే కొత్త లుక్​లో కనిపించి ఆకట్టుకున్నారు. గత కొన్నినెలల నుంచి లాక్​డౌన్​ ప్రభావంతో సినిమా షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో ఇంటికి, పార్టీ కార్యకలాపాలకే పరిమితమైన ఈయన.. తన వేషధారణపై పెద్దగా దృష్టి సారించలేదు. కానీ నవంబరు 1 నుంచి 'వకీల్​సాబ్'కు హాజరైన నేపథ్యంలో పూర్తి స్టైలిష్​గా దర్శనమిచ్చారు. దీంతోపాటే హైదరాబాద్​ మెట్రోలో గురువారం ఉదయం ప్రయాణించి ప్రజల్ని ఆశ్చర్యపరిచారు. అభిమాన నటుడు తమతో ప్రయాణిస్తున్నాడనే సరికి ఆయన్న చూసేందుకు వారు ఎగబడ్డారు.

మెట్రోలో పవన్ కల్యాణ్

మాదాపూర్ నుంచి మియాపూర్​ వరకు ప్రయాణించిన పవన్​ వెంట ఆయన వ్యక్తిగత సిబ్బంది, నిర్మాత దిల్​రాజు ఉన్నారు. మెట్రోలో తోటి ప్రయాణికుడైన ఓ రైతుతో మాట్లాడిన పవర్​స్టార్.. పంటల ప్రస్తుత పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇది తమ తొలి మెట్రో ప్రయాణమని ఒకరికి ఒకరు చెప్పుకున్న వీరిద్దరూ కాసేపు నవ్వుకున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 5, 2020, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.