Poonam Pandey Pornography Case: బాలీవుడ్‌ను కుదిపేసిన పోర్నోగ్రఫీ కేసులో నటి పూనమ్ పాండేకు కాస్త ఊరట లభించింది. పోర్న్ ఫిల్మ్స్ రాకెట్ కేసులో.. ఆమెకు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది సుప్రీం కోర్టు. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. పిటిషనర్‌కు నోటీసులు జారీ చేయాలని, ఆలోపు ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టరాదని స్పష్టం చేసింది.
పాండే ఇదివరకే ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ చేసుకోగా.. బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే నటి సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
పోర్నోగ్రఫీ కేసులో నటి షెర్లిన్ చోప్రాతో పాటు పూనమ్ పాండేపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. 2021 నవంబర్ 25న ఆమె చేసిన ముందస్తు బెయిల్ దరఖాస్తు తిరస్కరణకు గురైంది.
Raj Kundra Case: అశ్లీల చిత్రాల కేసులో నటుడు రాజ్ కుంద్రాకు కూడా డిసెంబర్లో అరెస్టు నుంచి రక్షణ కల్పించింది అపెక్స్ కోర్టు. కుంద్రాపై వేర్వేరు సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి.
అరెస్టుకు భయపడి కుంద్రా బెయిల్ కోసం తొలుత సెషన్స్ కోర్టుకు వెళ్లాడు. అక్కడ తిరస్కరించగా.. హైకోర్టును ఆశ్రయించాడు. తనను కావాలనే ఇరికించాలని అన్నాడు. అనంతరం సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాడు.
ఇవీ చూడండి: షెర్లిన్ చోప్రాపై రూ.50 కోట్ల పరువు నష్టం దావా