ETV Bharat / sitara

పవన్​-హరీశ్​ సినిమా సర్​ప్రైజ్​ వచ్చేసింది - పవన్​ కల్యాణ్​ హరీశ్​శంకర్​ పోస్టర్​

హరీశ్​ శంకర్​​ దర్శకత్వంలో రూపొందుతోన్న పవన్​ కల్యాణ్​ 28వ సినిమా ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. పవర్​స్టార్​ పుట్టినరోజు సందర్భంగా ఈ అప్​డేట్​ వచ్చింది.

Pawankalyan
పవన్​కల్యాణ్​
author img

By

Published : Sep 2, 2020, 4:23 PM IST

Updated : Sep 2, 2020, 4:39 PM IST

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన సినిమా నుంచి మరో సర్​ప్రైజ్​​ వచ్చింది. 'గబ్బర్​సింగ్​' తర్వాత పవన్​, దర్శకుడు హరీశ్​ శంకర్​ కాంబినేషన్​లో పవన్​ 28వ చిత్రం రూపొందుతోంది. తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో​ ఇండియా గేట్​ ఎదురుగా ఓ బైక్​పై పెద్ద బాలశిక్ష పుస్తకం ఉంది. సర్దార్​ వల్లభాయ్​ పటేల్​, సుభాష్​ చంద్రబోస్​ ఫొటోలను పోస్టర్​లో చూపించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్​ సంస్థ నిర్మిస్తోంది.

ఇప్పటికే విడుదలైన.. పవన్​-క్రిష్​ జాగర్లమూడి కాంబో చిత్రానికి సంబంధించిన ఫస్ట్​లుక్​ అభిమానులను విపరీతంగా ఆక్టటుకుంటోంది. ఇందులో చేతికి కడియం, ఉంగరాలు పెట్టుకుని అదరగొట్టాడు పవర్​స్టార్. దీంతోపాటు రిలీజ్​ అయిన ఆయన​ మరో సినిమా 'వకీల్​సాబ్'​ మోషన్​ పోస్టర్​ కూడా సోషల్​మీడియాలో దుమ్ములేపుతోంది.

'వకీల్​ సాబ్​', క్రిష్​ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాల చిత్రీకరణ పూర్తవగానే హరీశ్​ శంకర్​తో ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.

ఇవీ చూడండి:

Last Updated : Sep 2, 2020, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.