బాలీవుడ్ నటి అనుష్క శర్మ నిర్మాణంలో తెరకెక్కిన తొలి వెబ్ సిరీస్ 'పాతాళ్‌లోక్'. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సిరీస్ మార్చి 15న విడుదలైంది. అమెజాన్ ప్రైమ్‌లో తొమ్మిది భాగాలుగా విడుదలైన ఈ సిరీస్ సామాజిక మాధ్యమాల్లో విశేషాదరణ దక్కించుకుంది. విమర్శకులు దీన్ని ప్రశంసిస్తుండగా.. కొన్ని సామాజిక-రాజకీయ వర్గాలు మాత్రం భిన్నగళాలు వినిపిస్తున్నాయి.
'పాతాళ్‌లోక్' విడుదలైన తర్వాత ట్విట్టర్లో ప్రేక్షకులు విభిన్న అభిప్రాయాలతో స్పందించారు. కొన్ని సన్నివేశాలపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులో ఓ మహిళా పోలీసు ఒక యువతిని కొట్టి సామాజిక అభ్యంతరకరమైన భాషలో పిలిచినప్పుడు అది ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసిందని.. చిత్రబృందం ఆ భాగాన్ని సెన్సార్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కొన్ని సన్నివేశాలు హిందువులను కించపరిచే విధంగా ఉన్నాయని వాటికి ముందుస్తు విజ్ఞప్తి లాంటివి ఏవీ లేవని కొంతమంది అసహనం వ్యక్తం చేశారు. ప్రైమ్‌ను హిందూ వ్యతిరేకని పలువురు నెటిజన్లు అభివర్ణించారు. ఇలాంటి వివాదాల మధ్య కూడా ఈ వెబ్‌సిరీస్ ప్రశంసలు దక్కించుకుంటోంది.
-
Unsubscribe @PrimeVideo for showing such anti hindu web series. #patalok https://t.co/RFxyTETy5h
— Parimal (@parimal_05) May 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Unsubscribe @PrimeVideo for showing such anti hindu web series. #patalok https://t.co/RFxyTETy5h
— Parimal (@parimal_05) May 17, 2020Unsubscribe @PrimeVideo for showing such anti hindu web series. #patalok https://t.co/RFxyTETy5h
— Parimal (@parimal_05) May 17, 2020
తరుణ్ తేజ్‌పాల్ రచించిన నవల ఆధారంగా 'పాతాళ్‌లోక్' తెరకెక్కింది. దర్శకుడు సుదీప్ శర్మ సస్పెన్స్, థ్రిల్లింగ్‌తో పాటు పౌరాణిక అంశాలను కలిపి కథగా రాసుకున్నాడు.
ఇదీ చూడండి.. 'అన్నీ మారాయి.. కానీ మేం మాత్రం'