ETV Bharat / sitara

ఆస్కార్-2021 వాయిదా.. ఫిబ్రవరిలో లేనట్లే! - Oscars 2021 May Be Postponed Due To Coronavirus

కరోనా వైరస్ కారణంగా ఆస్కార్ అవార్డులు వాయిదా పడనున్నాయని తెలుస్తోంది. ఇంతకుముందు ఫిబ్రవరి 28, 2021న జరగాల్సిన ఈ పురస్కార వేడుకను వాయిదా వేయాలని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్​ అండ్ సైన్సెస్ భావిస్తోందట.

ఆస్కార్స్
ఆస్కార్స్
author img

By

Published : May 20, 2020, 6:50 PM IST

కరోనా వైరస్‌ కారణంగా అంతర్జాతీయంగా అన్ని రకాల సినిమాలు తమ విడుదల తేదీని మార్చుకున్నాయి. అంతేకాదు ఎంతో గొప్పగా జరిగే ఆస్కార్‌ అవార్డుల ఉత్సవం కూడా వాయిదా పడింది. అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్ అండ్‌ సైన్సెస్‌ ఆస్కార్‌ను వాయిదా వేయాలని నిర్ణయించిందట. ప్రస్తుతానికి 93వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం ఫిబ్రవరి 28, 2021న జరగనుంది. అయితే తాజాగా ఆస్కార్‌ వేడుకను వేరే తేదీలకు కూడా మార్చవచ్చని హాలీవుడ్‌ సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఇప్పటికే అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్‌ సైన్సెస్‌ ఆస్కార్‌ ఎంట్రీలో మార్పులు చేసింది. అయితే ఇది శాశ్వత మార్పు కాదని కూడా చెబుతోంది. ఇప్పటికే సౌండ్ మిక్సింగ్‌-సౌండ్‌ ఎడిటింగ్‌ ఒక అవార్డు కింద కలిపేశారు.

"మహమ్మారి కరోనా మా ప్రణాళికలన్నింటిని మార్చేసింది. అయితే ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోవడం అసాధ్యం. మేం ఘనంగా ఈ చిత్రోత్సవాలను జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అది ఎలా అన్నది తెలియడం లేదు."

-డేవిడ్‌ రూబిన్‌, అకాడమీ అద్యక్షుడు

కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) కారణంగా భారీ బడ్జెట్‌ చిత్రాలైన 'జేమ్స్ బాండ్‌-నో టైమ్‌ టు డై' చిత్రం మొదలుకుని 'గన్‌ మావెరిక్‌', 'ములన్‌', మార్వెల్‌ సంస్థకు చెందిన 'బ్లాక్‌ విడో'లాంటి చిత్రాలు వాయిదా పడ్డాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.