తనపై అమితమైన ప్రేమ కురిపిస్తున్న అభిమానులకు జీవితాంతం రుణపడి ఉంటానని కథానాయకుడు ఎన్టీఆర్ తెలిపారు. ఆయన బుధవారం తన 37వ పుట్టినరోజును జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులతోపాటు అభిమానులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కె. రాఘవేంద్రరావు, చిరంజీవి, ఎస్.ఎస్. రాజమౌళి, రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్ సింగ్, కాజల్ తదితరులు విష్ చేసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా తారక్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ భావోద్వేగంతో ట్వీట్ చేశారు.
"మీరు నా మీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను? చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప"
-తారక్ ట్వీట్
తనకు శుభాకాంక్షలు చెప్పిన తోటి నటీనటులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు తారక్. ట్వీట్లన్నీ చదివానని, తన పుట్టినరోజును ప్రత్యేకం చేశారని చెప్పారు.
-
I'd like to thank my colleagues, well wishers and members of the Film Fraternity from the bottom of my heart, for the warm birthday wishes. Felt great to read all the tweets and you've made this day very special 🙏🏻
— Jr NTR (@tarak9999) May 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I'd like to thank my colleagues, well wishers and members of the Film Fraternity from the bottom of my heart, for the warm birthday wishes. Felt great to read all the tweets and you've made this day very special 🙏🏻
— Jr NTR (@tarak9999) May 20, 2020I'd like to thank my colleagues, well wishers and members of the Film Fraternity from the bottom of my heart, for the warm birthday wishes. Felt great to read all the tweets and you've made this day very special 🙏🏻
— Jr NTR (@tarak9999) May 20, 2020
తారక్ ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలో నటిస్తున్నారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ మరో కథానాయకుడు. దానయ్య నిర్మాత.