ETV Bharat / sitara

'కేజీఎఫ్​2' ఐటెమ్ సాంగ్​​.. హాట్​ భామతో! - nora fatehi item song

KGF Chapter 2 Item Song: ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కేజీఎఫ్​ 2' నుంచి ఆసక్తికర అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బిగ్​బీ అమితాబ్​ నటించిన సూపర్​హిట్ చిత్రం 'షోలే'లోని 'మెహబాబూ..' పాటను రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో నోరా ఫతేహి నటించనుందట.

nora fatehi
కేజీఎఫ్​2
author img

By

Published : Feb 8, 2022, 5:39 AM IST

Updated : Feb 8, 2022, 6:14 AM IST

KGF Chapter 2 Item Song: భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ఇండియా చిత్రం 'కేజీయఫ్‌-2'. ఈ చిత్రం కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా నటించిన 'కేజీయఫ్-1‌'కు కొనసాగింపుగా రానుంది. బాలీవుడ్‌ తారలు సంజయ్‌ దత్‌, రవీనా టండన్‌ ఈ చిత్రానికి ఆకర్షణగా నిలువనున్నారు. ఇటీవలే ఈ సినిమా ఐటమ్‌సాంగ్‌కు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్‌ వినిపిస్తోంది. బాలీవుడ్‌ నటి నోరా ఫతేహి.. హీరో యశ్‌ సరసన నర్తించినట్లు సమాచారం.

nora fatehi
నోరా ఫతేహి

'కేజీయఫ్‌-1‌'లోని స్పెషల్‌ సాంగ్‌ కోసం 1989లో విడుదలైన జాకీ ష్రాఫ్‌ చిత్రం 'త్రిదేవ్‌'లోని 'గలీ గలీ మేన్‌ ఫిర్తా' పాటను రీమేక్‌ చేశారు. బాలీవుడ్‌ భామ మౌనీరాయ్‌ అందులో ఆడిపాడింది. ఇప్పుడు ఐటమ్‌సాంగ్‌ విషయంలో 'కేజీయఫ్‌-2'లోనూ అదే సీన్‌ను రిపీట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. 1975లో విడుదలైన అమితాబ్‌ సూపర్‌ హిట్‌ క్లాసిక్‌ చిత్రం 'షోలే'లోని 'మెహబూబా.. మెహబూబా' పాటను రీమేక్‌ చేస్తున్నారట. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సాంగ్‌ను విడుదల చేయనున్నారట.

nora fatehi
నోరా

ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా చిత్రం ఏప్రిల్‌ 14న థియేటర్లలో సందడిచేయనుంది.

kgf chapter 2
'కేజీఎఫ్​2'

ఇదీ చూడండి: 'సర్కారు వారి పాట' క్రేజీ అప్డేట్​ వచ్చేసింది

Last Updated : Feb 8, 2022, 6:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.