ETV Bharat / sitara

'అప్పటివరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండండి' - నాని వి సినిమా వార్తలు

నేచురల్ స్టార్ నాని ప్రధానపాత్రలో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వి'. ఈ సినిమా షూటింగ్​ మొదటి రోజుకు సంబంధించిన స్టిల్​ను తాజాగా నెట్టింట పంచుకున్నాడు నాని.

నాని
నాని
author img

By

Published : Jun 13, 2020, 7:39 PM IST

టాలీవుడ్ నేచురల్‌ స్టార్‌ నాని త్వరలో రాబోయో చిత్రం 'వి' నుంచి ఓ స్టిల్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. అందులో రఫ్ లుక్​లో కనిపిస్తున్నాడు నాని. ఈ చిత్ర తొలిరోజు షూటింగ్ సమయంలో తీసిన పిక్​ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

"మొదటి రోజు షూట్​ సందర్భంలోని పిక్. మనమందరం కలిసి ఈ సినిమా చూసే రోజు కోసం వేచి చూస్తున్నా. అప్పటి వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండండి.."అంటూ రాసుకొచ్చాడు నాని.

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుధీర్‌బాబు, నివేదా థామస్‌, అదితిరావు హైదరి, జగపతిబాబు, వెన్నెల కిశోర్‌, అవసరాల శ్రీనివాస్‌ తదితర నటీనటులు నటించారు. కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రం తెరపైకి రాలేదు. ప్రభుత్వం థియేటర్లకు అనుమతి రాగానే సినిమాను విడుదల చేయనున్నట్లు సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.