ETV Bharat / sitara

కొత్త దర్శకుడి కథకు నాని గ్రీన్ సిగ్నల్! - నాని తాజా వార్తలు

నేచురల్ స్టార్ నాని వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్నాడు. ఇప్పటికే మూడు సినిమాలను లైన్​లో పెట్టిన నాని.. మరో కథకూ ఓకే చెప్పినట్లు సమాచారం.

నాని
నాని
author img

By

Published : May 21, 2020, 10:07 AM IST

వేగంగా చిత్రాలు చేయడంలో ముందుంటాడు యువ కథానాయకుడు నాని. సంవత్సరానికి రెండు మూడు చిత్రాలు పట్టాలెక్కిస్తుంటాడు. ఈ ఏడాది అదే జోరు చూపించబోతున్నాడు. 'వి' విడుదల అవ్వాల్సి ఉండగా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదాపడింది. 'టక్‌ జగదీష్‌' చిత్రీకరణ ప్రారంభమైంది. 'శ్యామ్‌ సింగరాయ్‌' చిత్రం ప్రకటించాడు. ఇవే కాకుండా 'బ్రోచెవారెవరురా' ఫేం వివేక్‌ ఆత్రేయతోనూ ఓ సినిమా చేసే అవకాశాలున్నాయి.

తాజాగా నాని మరో కథకు పచ్చజెండా ఊపనున్నాడని టాలీవుడ్‌ టాక్‌. సుకుమార్‌ దగ్గర దర్శకత్వ విభాగంలో పనిచేసిన శ్రీకాంత్‌ ఈ హీరోకు ఓ కథ వినిపించాడట. ఇప్పటివరకు నాని చేయని పాత్రని, అందుకే ఓకే చేసే ఆలోచనలో ఉన్నాడని ప్రచారం సాగుతోంది. కొన్ని రోజుల్లో స్పష్టత రావచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.