ETV Bharat / sitara

Nani Tuck Jagadish: 'ఆ లుక్​ చూసి మీరు షాకవుతారు' - నాని మూవీ న్యూస్

'టక్ జగదీష్' విడుదల సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చెప్పారు హీరో నాని. రీమేక్​ల జోలికి ఇకపై వెళ్లనని, ముందు ముందు సరికొత్త కథలతో ప్రేక్షకుల్ని అలరిస్తానని అన్నారు.

Nani Tuck jagadish movie
నాని 'టక్ జగదీష్'
author img

By

Published : Sep 9, 2021, 5:05 PM IST

నేచురల్‌ స్టార్‌ నాని.. విభిన్నమైన కథలతో నటుడిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని.. తనకంటూ స్పెషల్‌ ఫ్యాన్‌బేస్‌ ఏర్పాటు చేసుకున్నారు. తరచూ ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించే నాని సరికొత్త చిత్రం 'టక్‌ జగదీష్'. తెలుగింటి కుటుంబకథతో తెరకెక్కిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఓటీటీలో మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'టక్‌ జగదీష్' ప్రమోషన్స్‌లో భాగంగా నాని విలేకర్లతో ముచ్చటించారు. ఆ విశేషాలివే..

బిగ్‌ స్క్రీన్స్‌ మిస్‌ అవుతున్నా..!

సినిమా అంటే నాకెంతో ఇష్టం. ముఖ్యంగా థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూడడమంటే ఆసక్తి. కరోనా కారణంగా పరిస్థితులు తారుమారయ్యాయి. దానివల్లే 'టక్‌ జగదీష్' చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నాం. బిగ్‌ స్క్రీన్‌ను ఎంతగానో మిస్‌ అవుతున్నా. భవిష్యత్తులో పరిస్థితులు చక్కబడిన తర్వాత బిగ్‌ స్క్రీన్‌పై సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నా. వరుస ప్రాజెక్ట్‌లు రెడీ చేస్తున్నా.

hero Nani
హీరో నాని

నో చెప్పాలని వెళ్లా..!

నేను కథానాయకుడిగా నటించిన 'నిన్నుకోరి' చిత్రంతో శివ నిర్వాణ దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ సమయంలోనే శివతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. 'నిన్నుకోరి' తర్వాత శివ దర్శకత్వంలో నేను యాక్టింగ్‌లో బిజీ అయిపోయాం. ఓ రోజు సడెన్‌గా శివ దగ్గర నుంచి ఫోన్‌ వచ్చింది. 'నానిగారు నా దగ్గర ఓ కథ ఉంది. మీకు వినిపించాలనుకుంటున్నాను' అని చెప్పాడు. అప్పటికే శివ.. 'మజిలీ'తో హిట్‌ అందుకున్నాడు. ప్రేమ, రిలేషన్‌షిప్‌ చిత్రాల్లో నటించాలనే ఆసక్తి అప్పుడు నాకు లేదు. కాబట్టి, శివకు నో చెప్పేద్దాం అనుకున్నా. ఫోన్‌లో అలా చెప్తే బాగోదని భావించా. ముందు వెళ్లి కథ విందాం. లవ్‌ స్టోరీ అయితే వెంటనే నో చెప్పేద్దాం అనుకుంటూ శివని కలిశా. 'ఒక పిల్లాడికి తన తండ్రి.. "ఒరేయ్‌ జగదీష్.. మగపిల్లాడు ఏడవకూడదు. ఆడపిల్లను ఏడిపించకూడదు. అది ఇంటికి.. ఊరికి మంచిది కాదు అని చెప్పగానే సినిమా టైటిల్‌ పడుతుంది' అని శివ ఒక్కలైన్‌ మాత్రమే చెప్పాడు. ఆ ఒక్క మాటకే ప్రాజెక్ట్‌ ఓకే చేసేయాలనిపించింది. శివ తీసిన ముందు సినిమాలతో పోలిస్తే ఇది చాలా భిన్నమైన కథ. ఎప్పటి నుంచో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేయాలనే ఆశ నాకు ఉంది. ఆ కోరిక ఈ సినిమాతో నెరవేరింది.

'టక్‌.. జగదీష్'

కుటుంబసభ్యులు, లేదా తన ఊర్లో ఉండే వాళ్ల పేర్లనే శివ ఎక్కువగా సినిమాల్లోని పాత్రలకు వాడుతుంటాడు. దానివల్ల పాత్రకు ఒకరకమైన సహజత్వం వచ్చేస్తుంది. శివలో ఈ విషయం నాకెంతో నచ్చుతుంది. కథ ఓకే అనుకున్నా తర్వాత సినిమాకు మేము 'టక్‌ జగదీష్' అనే పేరు అనుకోలేదు. హీరో క్యారెక్టర్‌ పేరు మాత్రమే 'టక్‌ జగదీష్'. చిన్నప్పటి నుంచి అతనికి టక్‌ చేసుకోవడమంటే ఎంతో ఇష్టం. అసలు హీరోకు టక్‌ అంటే ఎందుకంత ఇష్టమో చెబుతూ.. సినిమాలో ఓ డైలాగ్‌ ఉంటుంది. దానికి ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అయిపోతారు.

ఆమె ఆయువు పట్టు

'టక్‌ జగదీష్' కథకు ఐశ్వర్యా రాజేశ్‌ ఆయువు పట్టు. ఇందులో ఆమె నా మేనకోడలు పాత్ర పోషించింది. ఆమెను చంద్రమ్మ అని ముద్దుగా పిలుస్తుంటా. జగదీశ్‌కు చంద్రమ్మ ఎంత ముఖ్యం? ఆమె కోసం జగదీశ్‌ ఎంత దూరం వెళ్తాడు? అనేది సినిమా. మరోవైపు, రీతూవర్మ ఇందులో నా ప్రియురాలిగా కనిపించనుంది. ఆమె స్క్రీన్‌పై కనిపించిన ప్రతిసారీ కథ మరో ఫీల్‌లోకి వెళ్తుంది. వాళ్లిద్దరిదీ ముఖ్యమైన పాత్రలే. కానీ వాళ్లిద్దరికీ కలిసి సీన్స్‌ ఏమీ లేవు. అలాగే జగపతిబాబు నాకు అన్నయ్య పాత్ర పోషించారు.

Nani ritu varma
నాని రీతూవర్మ

అదే నమ్ముతా..!

నా చిన్నతనంలో ఉన్నప్పుడు మా బాబాయ్‌ వాళ్లు ఒక మాట చెప్పుకొంటుంటే విన్నా. 'నటుడంటే ఎన్టీఆర్‌. ఎందుకంటే నటుడంటే.. తన నవ్వుతో ప్రేక్షకుల్ని నవ్వించాలి. తన బాధతో ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించాలి' అని వాళ్లు ఆరోజు చెప్పుకొన్న ఆ మాట ఇప్పటికీ నా మదిలో నిలిచిపోయింది. నటుడంటే అన్నిరకాల జానర్లలో ప్రేక్షకుల్ని అలరించాలి. దానినే నేను నమ్ముతా. కెరీర్‌ ఆరంభంలో కామెడీ చేస్తే నవ్వారు. తర్వాత 'జెర్సీ'తో అందరి చేత కన్నీళ్లు పెట్టించా. ఈ క్రమంలోనే విభిన్నమైన కథలు చేస్తున్నా. ఇకపై నా నుంచి మీకు రెగ్యులర్‌గా సినిమాలు వస్తుంటాయి. అన్ని విభిన్నమైన కథలే ఉంటాయి. దసరాకు కొత్త సినిమా అనౌన్స్‌ చేస్తున్నా. ఆ ఫస్ట్‌ లుక్‌ చూసి అందరూ షాక్‌ అవుతారు.

లవ్‌స్టోరీలు చేస్తా..!

నటుడిగా నాకంటూ ఓ గ్రాఫ్‌ క్రియేట్‌ చేసుకోవాలని అనుకున్నా. అందుకే విభిన్నమైన కథలు ఓకే చేస్తున్నాను. వాటితోపాటే లవ్‌స్టోరీలు కూడా చేస్తా. శివ నాకు 'టక్‌ జగదీష్' చెప్పేసమయానికి ప్రేమకథల్లో నటించడానికి నేను సిద్ధంగా లేను. ఇప్పుడు 'వి', 'టక్‌ జగదీశ్‌' అయిన తర్వాత ఓ ప్రేమకథా చిత్రంలో నటించాలనిపించింది. అలా 'అంటే సుందరానికీ!' ఓకే చేశా. అది ఫుల్‌ కామెడీ, ప్రేమకథా చిత్రం.

hero Nani
హీరో నాని

'రాజారాణీ' చేయాలనుకున్నా..!

అట్లీ దర్శకత్వం వహించిన 'రాజా రాణీ' సినిమా మొదట ఆఫర్‌ నాకే వచ్చింది. సినిమా కథ నాకు బాగా నచ్చింది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నాకు అర్థమైంది. కాకపోతే, ఆ సమయంలో నేను.. 'ఎటో వెళ్లిపోయింది మనసు', 'పైసా' సినిమా షూటింగ్స్‌తో ఫుల్‌ బిజీగా ఉన్నా. దానివల్ల నిర్మాతతో మాట్లాడి.. నేనే ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నా. ఆ తర్వాత.. 'ఎఫ్‌-2'కు కూడా నన్ను అడిగారు. ఆ సినిమా కూడా వేరే షూటింగ్స్‌ వల్ల వదులుకున్నా.

రీమేక్స్‌ చేయాలని లేదు..!

నాకు రీమేక్స్‌ చేయాలని లేదు. వాటి జోలికి పోకూడదని నిర్ణయించుకున్నా. కెరీర్‌ ఆరంభంలో 'భీమిలి కబడ్డీ జట్టు', 'ఆహా కల్యాణం'.. రెండు రీమేక్‌లు చేశా. 'ఆహా కల్యాణం'తో యశ్‌ రాజ్‌ ప్రొడక్షన్స్ సౌత్‌లోకి రావాలని నిర్ణయించుకుంది. కాకపోతే, ఆ సినిమా ఫలితంతో వాళ్లు ఇక్కడ అడుగుపెట్టలేదు (నవ్వులు).

Nani
టక్ జగదీష్​ సినిమాలో నాని

ప్రూవ్‌ చేయలేను..!

సాధారణంగా ఒక సినిమా విడుదలైతే.. పలు సెంటర్లలో దానికి వచ్చిన కలెక్షన్స్‌ని ఆధారంగా చేసుకుని సినిమా హిట్టో లేదా ఫట్టో చెప్పగలం. కానీ 'వి' ఓటీటీలో విడుదలైంది. ఆ సినిమా విడుదలయ్యాక.. ప్రైమ్‌ సబ్‌స్క్రైబర్స్ కూడా పెరిగారు. దిల్‌రాజుకు కూడా మంచిగా డబ్బు వచ్చింది. ఇటు ఆయన హ్యాపీ.. అటు అమెజాన్‌ వాళ్లు హ్యాపీ.. కానీ అందరూ నన్ను 'వి ఆడలేదు' కదా అంటారు. అలా అడిగిన వాళ్లందరికీ ప్రూవ్‌ చేయడానికి ఇంతకు ముందులా నా వద్ద కలెక్షన్‌ రికార్డులు లేవు.

పాన్‌ ఇండియా ఉండకపోవచ్చు..!

ఇప్పుడు ఎక్కడ చూసినా పాన్‌ ఇండియా అనే పేరు ఎక్కువగా ఉంటున్నాం. మరో రెండేళ్లు ఆగితే ఆ పదం అస్సలు వినిపించదు. ఎందుకంటే, సోషల్‌మీడియా‌, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ వల్ల.. మంచి కంటెంట్‌ ఉంటే ఏ ప్రాంతానికి చెందిన చిత్రాన్నైనా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వేరే ఇండస్ట్రీలకు చెందిన సినిమాలు కూడా తెలుగువారికి చేరువవుతున్నాయి. కాబట్టి కంటెంట్‌ మీద దృష్టి సారించడం ఎంతో ముఖ్యమైన సంగతి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.