ETV Bharat / sitara

మహేశ్ జిమ్​ పేరేంటో తెలుసా? - లయన్స్ డెన్ మహేశ్

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్​ బాబుకు సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్. ఇందులో మహేశ్ వ్యాయామశాలను పరిచయం చేసింది.

మహేశ్
మహేశ్
author img

By

Published : May 21, 2020, 8:32 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు వ్యక్తిగత, సినిమాల గురించి ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్‌. తాజాగా మహేశ్ వ్యాయామశాలను పరిచయం చేసింది. ప్రిన్స్ ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ప్రతిరోజు కసరత్తులు చేసి వయసు తగ్గించుకుంటారాయన. ఇందుకు ఇంట్లోనే పెద్ద జిమ్‌ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి సంబంధించిన ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేస్తూ ఈ జిమ్‌ పేరుని చెప్పుకొచ్చింది.

ఈ వీడియోలో మహేశ్ షార్ట్‌లో దర్శనమిచ్చారు. ఈ వీడియోకు 'ది లయన్స్ డెన్‌' అనే వ్యాఖ్యను జోడించింది నమ్రత. సింహాలుండే ప్రదేశమని దానర్థం. సినిమాల విషయానికొస్తే పరశురామ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నారు మహేశ్. త్వరలోనే లాంఛనంగా ప్రారంభం కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.