Chinmayi Sripaada: డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకుని, మీటూ ఉద్యమ సమయంలో పలువురు ప్రముఖులపై షాకింగ్ కామెంట్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు గాయని చిన్మయి శ్రీపాద. 'మీటూ' ఉద్యమ సమయంలో గళమెత్తిన కారణంగా ఆమె కోలీవుడ్ ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుతం దక్షిణాదిలోని పలు చిత్రాలకు సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు, సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తరచూ ఆమె సోషల్‌మీడియా వేదికగా స్పందిస్తున్నారు. వృత్తిపర, వ్యక్తిగత విషయాలపై ఆమెతో చర్చించాలనుకునే వారి సంఖ్య పెరిగింది. దీంతో, పలువురు.. చిన్మయి వాళ్లమ్మకు ఫోన్లు చేయడం మొదలు పెట్టారు.
కాగా, ఈ విషయంపై చిన్మయి స్పందించారు. 'వృత్తిపరమైన, వ్యక్తిగత అంశాల విషయంలో ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే.. మా అమ్మకు ఫోన్ చేసి ఇబ్బందిపెట్టకండి. ఆమె నా స్పోక్స్ పర్సన్ కాదు. సోషల్‌మీడియాలో ఆమె ఏం పెట్టినా వాటితో నాకు సంబంధం లేదు. మీరు నాతో మాట్లాడాలని అనుకుంటే మా మేనేజర్‌కి కాల్ చేయండి' అని చిన్మయి శ్రీపాద తెలిపారు.
ఇదీ చూడండి: