ETV Bharat / sitara

'గ్యాంగ్స్​ ఆఫ్​ వాసేపుర్​'​ నటుడిపై కేసు నమోదు

'గ్యాంగ్స్​ ఆఫ్​ వాసేపుర్​'​ రచయిత, నటుడు జైషాన్​ క్వాద్రిపై కేసు నమోదైంది. జైషాన్​ రూపొందిస్తున్న వెబ్​సిరీస్​లో పెట్టుబడులు పెట్టిన సహనిర్మాత జతిన్​ సేథి.. తనకు రావాల్సిన రూ. 1.5 కోట్లను ఇవ్వకుండా మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించాడు.

Mumbai Police files FIR against actor Zeishan Quadri
'గ్యాంగ్స్​ ఆఫ్​ వాస్సేపూర్'​ నటుడిపై కేసు నమోదు
author img

By

Published : Dec 2, 2020, 10:40 PM IST

బాలీవుడ్​ నటుడు, రచయిత జైషాన్​ క్వాద్రిపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. రూ.1.5 కోట్ల మేర మోసం చేశాడని తనపై సహనిర్మాత జతిన్​ సేథి పోలీసులను ఆశ్రయించాడు. క్వాద్రి రూపొందించే ఓ వెబ్​సిరీస్​ను నిర్మించేందుకు జతిన్​తో పాటు అతని స్నేహితుడొకరు పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ వెబ్​సిరీస్​ తాలూకా పెట్టుబడులను తిరిగి ఇవ్వడంలో జైషాన్​ విఫలమయ్యాడని జతిన్​ సేథి ఫిర్యాదులో పేర్కొన్నాడు.

జతిన్​ సేథి అనే సహనిర్మాత.. జైషాన్​ తనను రూ.1.5 కోట్ల ఫైనాన్స్​తో మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో జైషాన్​ క్వాద్రిపై భారతీయ శిక్షాస్మృతి ప్రకారం చీటింగ్​ (420)తో పాటు క్రిమినల్​ ట్రస్ట్​ ఉల్లంఘన (406) కింద కేసు నమోదైంది. ఫిర్యాదు ప్రకారం గడువులోగా క్వాద్రి డబ్బును తిరిగి ఇవ్వడంలో విఫలమయ్యాడని.. ఆ తర్వాత ఇచ్చిన చెక్కులు ఇచ్చినా, అవి బౌన్స్​ అయ్యాయని జతిన్​ తెలిపాడు. దీనిపై అంబోలి పోలీసులు ప్రాథమిక విచారణ చేపడుతున్నారు.

అనురాగ్​ కశ్యప్​ రూపొందించిన సినిమా.. గ్యాంగ్స్​ ఆఫ్​ వాసేపుర్​'లో జైషాన్​ క్వాద్రి సహరచయితగా వ్యవహరిస్తూ.. అందులో నటించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.