ETV Bharat / sitara

ముంబయిలో గాడ్​ఫాదర్.. ఆ సినిమాలో ఉక్రెయిన్ భామ.. 'శెభాష్‌ మిథు' సినిమా టీజర్‌.. - శభాష్ మిథు మూవీ

Movie Updates: కొత్త సినిమా అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో నటుడు చిరంజీవి సినిమా 'గాడ్​ఫాదర్', 'శెభాష్‌ మిథు', 'జాతిరత్నాలు'  సినిమా దర్శకుడు కేవీ అనుదీప్‌ కొత్త చిత్రాలు ఉన్నాయి.

Movie Updates
గాడ్​ఫాదర్
author img

By

Published : Mar 22, 2022, 7:58 AM IST

Updated : Mar 22, 2022, 10:47 AM IST

Movie Updates: చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'గాడ్‌ఫాదర్‌'. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్‌.బి.చౌదరి, ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మాతలు. బాలీవుడ్‌ కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ ఇందులో ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. ఇటీవలే కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం ముంబయి వెళ్లింది చిత్రబృందం. సోమవారంతో అక్కడ షెడ్యూల్‌ పూర్తయినట్టు తెలిపాయి సినీవర్గాలు. "రాజకీయం నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామా కథ ఇది. చిరంజీవితో, సల్మాన్‌ఖాన్‌లు శక్తిమంతమైన పాత్రల్లో కనిపిస్తారు. ముంబయిలో ఆ ఇద్దరిపై కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించాం. అభిమానులకి పండగలా ఉంటాయి ఆ సన్నివేశాలు. త్వరలోనే కొత్త షెడ్యూల్‌ మొదలవుతుంది" అని తెలిపాయి సినీ వర్గాలు. ఇందులో ప్రముఖ కథానాయిక నయనతార ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: కొణిదెల సురేఖ, సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: నీరవ్‌షా.

Godfather
గాడ్​ఫాదర్​

'జాతిరత్నాలు' సినిమాతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు దర్శకుడు కేవీ అనుదీప్‌. ఇప్పుడాయన శివ కార్తికేయన్‌ హీరోగా ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలోరూపొందుతోంది. దీన్ని నారాయణ దాస్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌ మోహన్‌రావు, సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథా నాయికగా ఉక్రెయిన్‌ నటి మరియా ర్యాబోషప్క ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది. మారియా ఇప్పటికే రెండు ఉక్రెనియన్‌ సినిమాల్లో నటించింది. అలాగే భారతీయ వెబ్‌సిరీస్‌ 'స్పెషల్‌ ఆఫ్ల్సో'లోప్రధాన పాత్ర పోషించి.. మెప్పించింది. "పుదుచ్చేరి, లండన్‌ నేపథ్యాలలో సాగే విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. వినోదభరితంగా సాగే రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది.ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది" అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి తమన్‌ స్వరాలందిస్తున్నారు.

Ukraine actress
ఉక్రెయిన్ నటి మరియా ర్యాబోషప్క

Shabaash Mithu: "నాలుగు వరల్డ్‌ కప్‌ల్లో భారత జట్టుకు సారథ్యం.. అతిచిన్న వయసులో టెస్ట్‌ మ్యాచుల్లో 200 పరుగులు.. 23 ఏళ్ల సుధీర్ఘ ప్రస్థానం.. జెంటిల్‌మెన్స్‌ ఆటగా పేర్కొనే క్రికెట్‌లో ఓ మహిళ సాధించిన ఘనత ఇది.." అంటూ 'శెభాష్‌ మిథు' సినిమా టీజర్‌ సాగింది. ఈ చిత్రంలో కథానాయిక తాప్సి ప్రముఖ మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌ పాత్రలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం మిథాలి క్రికెట్‌ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ ఓ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. "చరిత్రను తిరగరాయనందుకు బాధ పడలేదు.. ఆమె తనకే ఓ చరిత్ర సృష్టించుకుంది." అని ఈ టీజర్‌కు వ్యాఖ్య రాశారు. శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయ్‌ రాజ్‌ ఇందులో మరో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు.

Shabaash Mithu
శెభాష్‌ మిథు

ఇదీ చదవండి: 'ఆర్​ఆర్​ఆర్​ విషయంలో.. అదే అతి పెద్ద సవాల్‌..'

Last Updated : Mar 22, 2022, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.