RRR Movie Release: అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం 'రౌద్రం రణం రుధిరం' (ఆర్‌ఆర్‌ఆర్). తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా పేరు పొందిన రామ్‌చరణ్, తారక్ కాంబోలో ఈ సినిమా సిద్ధమైంది. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లతోపాటు సోషల్‌మీడియాలోనూ ఏదో ఒక రకంగా ఈ టీమ్ అభిమానుల్ని అలరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో 'ఆర్‌ఆర్‌ఆర్' తారల సోషల్ మీడియా స్టేటస్ గురించి తెలుసుకుందాం..!
జక్కన్న.. ఫాలో అయ్యేది ఆయన్నే..!
RajaMouli in Social Media: చేసే ప్రతి పనీ, తీసే ప్రతి షాట్ పర్‌ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటారు మన జక్కన్న. అందుకే ఆయన ఫోకస్ అంతా ఎప్పుడూ సినిమాలపైనే ఉంటుంది. తన సినిమాలు, హీరోలు, సన్నివేశాలు, లొకేషన్స్.. ఇలా వాటి గురించే ఆలోచించే ఆయన సోషల్‌మీడియాకు కాస్త దూరంగా ఉంటారు. సమయానుగుణంగా తన సినిమాలను ప్రమోట్ చేయడానికి, పలు అవగాహన కార్యక్రమాల కోసం మాత్రమే ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాలు ఉపయోగిస్తారు. అలా, ఆయన 2010లో ట్విటర్ వేదికగా మొదటిసారి సోషల్‌మీడియా వరల్డ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత సంవత్సరం అనగా 2011లో ఫేస్‌బుక్, 2018లో ఇన్‌స్టా ఖాతాలు ప్రారంభించారు. ఇప్పటివరకూ ట్విటర్‌లో ఆయన్ని 5.7 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా ఆయన 17మందిని మాత్రమే అనుసరిస్తున్నారు. ఇక, ఫేస్‌బుక్‌లో ఆయన్ని 7.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. రాజమౌళి మాత్రం కీరవాణి ఒక్కరినే ఫాలో అవుతున్నారు. ఇన్‌స్టాలో జక్కన్నని 1.1 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
రామ్‌చరణ్.. ఫాలో అయ్యేది ఇద్దర్నే..!
RamCharan In Social Media: 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్ మొత్తంలో సోషల్‌మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండేది రామ్‌చరణ్ మాత్రమే. కొత్త సినిమాల అప్‌డేట్స్‌తోపాటు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మధుర జ్ఞాపకాలను సైతం ఆయన తరచూ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. షూటింగ్స్ నుంచి ఖాళీ దొరికితే పెట్స్‌తో ఆడుకుంటూ సమయాన్ని గడుపుతారు. 2013లో ఫేస్‌బుక్‌లోకి అడుగుపెట్టిన చరణ్‌కి ఇప్పుడు 12 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. 2019లో ఇన్‌స్టాలో ఖాతా తెరవగా.. 5.2 మిలియన్ల మంది ఆయన్ని ఫాలో అవుతున్నారు. ఇక, కరోనా సమయంలో తరచూ వైరస్ వార్తలు చూసి కంగారు పడుతున్న నెటిజన్లకు కాస్త ఊరటనివ్వాలనే ఉద్దేశంతో చరణ్ ట్విటర్‌లోకి అడుగుపెట్టారు. అలా, ఆయన 2020లో ట్విటర్ ఖాతా ఓపెన్ చేయగా ప్రస్తుతం ఆయన్ని 2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆయన మాత్రం తన తండ్రి చిరంజీవి, బాబాయ్ పవన్‌కల్యాణ్‌ని మాత్రమే అనుసరిస్తున్నారు.
సోషల్ మీడియాకు కాస్త దూరం..!
NTR In Social Media: సోషల్‌మీడియా వరల్డ్‌కు దూరంగా ఉంటారు నటుడు తారక్. ఏ కాస్త సమయం దొరికినా ఫ్యామిలీ లైఫ్‌ని ఆయన ఎంజాయ్ చేస్తారు తప్ప.. నెట్టింట్లోకి మాత్రం చాలా అరుదుగా వస్తుంటారు. 2009లో ట్విటర్ వేదికగా అభిమానులన్ని పలకరించిన ఆయన అనంతరం ఫేస్‌బుక్ (2012), ఇన్‌స్టా (2018)ల్లోనూ ఖాతాలు తెరిచారు. ట్విటర్‌లో ఆయన్ని 5.7 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా, ఫేస్‌బుక్‌లో ఆ సంఖ్య 2 మిలియన్లుగా, ఇన్‌స్టాలో 3.6 మిలియన్లుగా ఉంది.
అలియాభట్..!
'ఆర్‌ఆర్‌ఆర్' తెలుగు తెరకు పరిచయమవుతున్న బాలీవుడ్ భామ అలియాభట్. స్టైలిష్ లైఫ్‌ని ఎంజాయ్ చేసే ఈ చిన్నది సోషల్‌మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. వర్క్, పర్సనల్ లైఫ్, బిజినెస్.. ఇలా ఎన్నో విషయాలను తరచూ ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో షేర్ చేస్తుంటుంది. ఎవరైనా వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తే వారికి దీటుగా సమాధానం ఇస్తుంటుంది. 2010లో ట్విటర్‌లోకి వచ్చిన ఆమెకు 21.3 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టా(61.4 మిలియన్లు), ఫేస్‌బుక్(8.5 మిలియన్లు)లోనూ ఆమెకు ఫాలోవర్స్ భారీగానే ఉన్నారు.
ఒలీవియా మోరీస్..!
'ఆర్‌ఆర్‌ఆర్'తో తెలుగు తెరకు పరిచయమవుతోన్న మరో భామ ఒలీవియా మోరీస్. లండన్‌కు చెందిన ఈ బ్యూటీ 'ఆర్‌ఆర్‌ఆర్'లో తారక్ లవ్ లేడీగా కనిపించనున్నట్లు సమాచారం. 'ఆర్‌ఆర్‌ఆర్' ప్రకటించిన తర్వాత సోషల్‌మీడియాలో ఈమెను ఫాలో అయ్యేవారి సంఖ్య కాస్త పెరిగిందనే చెప్పాలి. 2010లో ట్విటర్‌లోకి అడుగుపెట్టిన ఒలీవియాకు 62 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక, ఇన్‌స్టాలో లక్షమంది వరకూ ఆమెను అనుసరిస్తున్నారు.
ఇదీ చదవండి: ఆ పదిలో.. 'ఆస్కార్'ఎవరిని వరించేనో?