ETV Bharat / sitara

కశ్మీరీ పండిట్ల కన్నీటి గాథ.. 'ది కశ్మీర్​ ఫైల్స్​' - The Kashmir files actors

The Kashmir files movie review: 'రాధేశ్యామ్' మార్చి 11వరకు ఎక్కడ చూసినా ఈ పేరే. కానీ ఇప్పుడు 'ది కశ్మీర్​ ఫైల్స్'​. ఎటువంటి అంచనాలు లేకుండా, నిజజీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా 'రాధేశ్యామ్'​ విడుదలైన రోజే రిలీజై విశేష ప్రజాదరణను పొందుతోంది. 90వ దశకంలో కశ్మీర్‌ పండిట్‌లపై జరిగిన హత్యాకాండకు సంబంధించిన కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. ఇప్పుడు అందరూ ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. కలెక్షన్లు కూడా రెండు రోజుల్లోనే రెండింతలు పెరిగాయి. ఐఎమ్​డీబీలో అత్యధిక రేటింగ్​ అందుకున్న సినిమాగా ఘనతను కూడా అందుకుంది. ప్రధాని మోదీ సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడం విశేషం.

The Kashmir files record collections
ది కశ్మీర్​ ఫైల్స్​ కలెక్షన్స్​
author img

By

Published : Mar 13, 2022, 1:55 PM IST

Updated : Mar 13, 2022, 3:16 PM IST

The Kashmir files movie review: కొన్ని కొన్ని చిత్రాలు, వెబ్​సిరీస్​లు ఏ మాత్రం అంచనాలు లేకుండానే వచ్చి సూపర్​హిట్​గా నిలుస్తాయి. విపరీతమైన క్రేజ్​, ప్రశంసలను సంపాదించుకుంటాయి. రికార్డులు సృష్టిస్తాయి. సామాన్యలు నుంచి సినీప్రముఖుల వరకు వాటి గురించే మాట్లాడుకునేలా చేస్తాయి. తాజాగా విడుదలైన 'ది కశ్మీర్​ ఫైల్స్'​ కూడా ఆ జాబితాలోకే వస్తుంది.

Prabhas Radheshyam: దేశవ్యాప్తంగా అభిమానులు.. ప్రభాస్​ , పూజాహేగ్డే నటించిన 'రాధేశ్యామ్' కోసం​ ఎంతగా ఎదురుచూశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడ చూసిన ఈ చిత్రం గురించే మాట్లాడుకున్నారు. ఈ మూవీకి ప్రమోషన్స్​ కూడా భారీ స్థాయిలోనే జరిగాయి. ఎట్టకేలకు మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేల స్క్రీన్లపై విడుదలైంది. అయితే అదే రోజు ఎటువంటి అంచనాలు లేకుండా అనూహ్యంగా తెరపైకి వచ్చింది 'ది కశ్మీర్​ ఫైల్స్​'. అంతే అంచనాలు తారుమారయ్యాయి. 'రాధేశ్యామ్​' మిక్స్​డ్​ టాక్​ను అందుకోగా.. పరిమిత స్క్రీన్లపై రిలీజ్​ అయిన 'కశ్మీర్​ ఫైల్స్​' తొలి రోజు మొదటి షో నుంచే సూపర్​ హిట్​ టాక్​ను అందుకుంది. మొదటి రోజు ముగిసే సమయానికి సినిమా మరింత బలపడింది. దీంతో మెల్లమెల్లగా ఈ చిత్రం గురించి అందరికీ తెలిసింది. హిట్​ టాక్​ అందుకోవడం వల్ల క్రమక్రమంగా సినీప్రియులకు దీన్ని వీక్షించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో 'కశ్మీర్​ ఫైల్స్'​ ​ స్క్రీన్స్, షోస్​ పెరగడం, భారీగా బుకింగ్స్​​ అవ్వడం వల్ల మంచి వసూళ్లను అందుకుంటోంది.

సినిమా కథాంశం

The Kashmir files story: 'ది తాష్కెంట్‌ ఫైల్స్‌' సినిమాతో సినీప్రియులను మెప్పించిన దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి. ఆయన తెరకెక్కించిన చిత్రమే 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'. 90వ దశకంలో కశ్మీర్‌ పండిట్‌లపై జరిగిన మారణ హింసాకాండకు దృశ్య రూపమే ఈ చిత్రం. 1990లో కశ్మీర్​లో హిందూ పండిట్స్​పై జిహాదీలు దారుణ మారణకాండకు పాల్పడ్డారు. వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వారికి అక్కడ నిలువ నీడ లేకుండా చేసి స్వదేశంలోనే శరణార్థులుగా అయ్యేలా చేశారు. మొత్తంగా కశ్మీర్​ లోయలో చోటు చేసుకున్న ఈ భయానక సంఘటనలతో కశ్మీర్​ పండిట్స్​ కట్టుబట్టలతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. మొత్తంగా కశ్మీర్‌లోని తీవ్రవాదులు, వేర్పాటువాదుల దాడుల వల్ల ఓ సామాజిక వర్గం ఎలా అంతమైందో ఈ మూవీలో భావోద్వేగభరితంగా చూపించారు. కాగా, ఈ చిత్రంలో మిథున్‌ చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్‌, దర్శన్‌ కుమార్‌, పల్లవి జోషి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రధాని మోదీ ప్రశంసలు

Modi praises The Kashmir files: ఈ సినిమా చిత్రబృందం.. శనివారం(మార్చి 12) ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని, మూవీయూనిట్​ను అభినందించారు మోదీ. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత అభిషేక్​ అగర్వాల్​ ట్వీట్​​ చేశారు. మోదీతో కలిగి దిగిన ఫొటోలు పోస్ట్​ చేశారు. "గౌరవనీయులైన ప్రధానమంత్రి మోదీని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాను ఆయన ప్రశంసించడం, దాని గొప్పతనం గురించి చెప్పిన మాటలు మాకు ఎంతో ప్రత్యేకం. ఈ మూవీని నిర్మించడంలో మేము ఎవ్వరూ గర్వపడలేదు. ధన్యవాదాలు మోదీజీ" అని వ్యాఖ్య రాసుకొచ్చారు.

సినీవిశ్లేషకుడు తరణ్​ ఆదర్శ్​ చెప్పిన వివరాలు

  • 'రాధేశ్యామ్'​, ఇటీవలే విడుదలై 'గంగూబాయ్​ కతియావాడి', 'ది బ్యాట్​మ్యాన్​' కన్నా 'ది కశ్మీర్​ ఫైల్స్'​ను వీక్షించడానికే సినీప్రియులు ప్రాధాన్యత ఇస్తున్నారట!
  • స్క్రీన్స్​, షోలు పెరిగాయి
  • తొలి షో ఉదయం 6.30గంటలకే ప్రదర్శన అవుతోంది
  • నేడు(ఆదివారం) బుకింగ్స్​ కూడా భారీగా అయ్యాయి.

కలెక్షన్లు పెరిగాయి

The Kahmir files collections: సినిమా సెన్సేషనల్​ హిట్​ అవ్వడం వల్ల రెండో రోజు కలెక్షన్లు రెండింతలు పెరిగాయి. రెండో రోజు 139.44శాతం గ్రోత్​ను చూపించింది.​ 2020 తర్వాత.. సినిమా రిలీజ్​ అయిన రెండో రోజు ఈ స్థాయిలో గ్రోత్​ చూపించడం ఇదే తొలిసారి.

  • తొలి రోజు 3.55 కోట్లు వసూలు చేసింది.
  • రెండో రోజు 8.50కోట్లు.
  • మొత్తంగా రెండు రోజుల్లో రూ.12.05కోట్లు.

ఘనత

The Kahmir files highest rating: ఈ చిత్రం ఓ ఘనతను కూడా అందుకుంది. ప్రముఖ మూవీ రేటింగ్​ సంస్థ ఐఎమ్​డీబీలో అత్యధిక రేటింగ్​ అందుకున్న చిత్రంగా నిలిచింది. 10/10 రేటింగ్​ను అందుకుంది.

ఇదీ చూడండి: ఓటీటీలో 'స్పైడర్​మ్యాన్'​.. 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' రికార్డు!

Last Updated : Mar 13, 2022, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.