ETV Bharat / sitara

విలన్లతో ఓ ఆటాడి వచ్చిన సూపర్​స్టార్​! - సర్కారు వారి పాట రిలీజ్​ డేట్

సూపర్​స్టార్​ మహేశ్​బాబు(Mahesh Babu) కొత్త చిత్రం 'సర్కారు వారి పాట'(Sarkaru Vaari Paata).. గోవా షెడ్యూల్​ పూర్తయ్యింది. రామ్​-లక్ష్మణ్​ నేతృత్వంలో ఓ యాక్షన్​ సీక్వెన్స్​ను రూపొందించారు. అక్కడ షూటింగ్​ పూర్తిచేసుకున్న చిత్రబృందం హైదరాబాద్​కు తిరిగి వచ్చింది.

Mahesh Babu's Sarkaru Vaari Paata Movie Goa schedule is wrapped
విలన్లతో ఓ ఆటాడి వచ్చిన సూపర్​స్టార్​!
author img

By

Published : Aug 26, 2021, 6:44 AM IST

పులి.. కుందేలు కథ చెబుతూ 'సర్కారు వారి పాట'(Sarkaru Vaari Paata) బ్లాస్టర్‌తో హీరో మహేశ్ బాబు(Mahesh Babu)​ చేసిన సందడి అంతా ఇంతా కాదు. అదే తరహాలో మహేశ్​ మరోసారి విలన్లతో ఓ ఆట ఆడుకున్నారు. మరి ఆ ఆట ఎలా సాగిందో తెలియాలంటే మాత్రం 'సర్కారు వారి పాట' విడుదలయ్యే వరకు ఎదురు చూడాల్సిందేనని చిత్రబృందం అంటోంది.

ఈ సినిమాకు సంబంధించిన కీలక యాక్షన్​ సీక్వెన్స్​ తెరకెక్కించేందుకు గోవా చేరుకున్న చిత్రయూనిట్​.. బుధవారంతో షెడ్యూల్​ పూర్తి చేసుకొని హైదరాబాద్​ తిరిగి వచ్చింది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఓ సెట్‌లో.. రామ్‌ లక్ష్మణ్‌ నేతృత్వంలో ఆ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించారు.

పరశురామ్​(Parasuram) దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో మహేశ్​బాబు సరసన కీర్తిసురేశ్​(Keerthy Suresh) నటిస్తోంది. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట నిర్మాతలు. ఈ చిత్రం వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 13న(Sarkaru Vaari Paata Release Date) ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి.. స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికి కష్టమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.