మాదక ద్రవ్యాలకు బానిసలైన మురికివాడల పిల్లల్ని ఫుట్బాల్ ఆటగాళ్లగా తీర్చిదిద్దడానికి ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్ విజయ్ బార్సే చాలా కృషి చేశాడు. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది 'ఝుండ్'. అమితాబ్ బచ్చన్ టైటిల్ రోల్లో కనిపించనున్నారు. 'సైరత్' ఫేమ్ నాగ్రాజ్ ముంజులే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది.
ఇందులో ఎక్కడా అమితాబ్ కనిపించరు. 'కొంతమంది బ్యాట్లు, చైన్లు పట్టుకొని నడిచొస్తుంటే గుంపు కాదు సార్.. టీమ్' అంటూ అమితాబ్ గొంతు వినిపిస్తుంది. ఈ ఏడాది మే 8న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: రామ్ చరణ్ వద్దంటే.. నాని చేశాడట..!