ETV Bharat / sitara

'లైగర్' బాయ్స్ చిల్.. 'సత్యమేవ జయతే 2' ట్రైలర్ - john abraham satyameva jayate 2

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో లైగర్, ఊరికి ఉత్తరాన, హీరో, 1997, సత్యమేవ జయతే 2 చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

cinema news
మూవీ న్యూస్
author img

By

Published : Nov 13, 2021, 3:18 PM IST

వెగాస్​లో లైగర్ టీమ్..

హీరో విజయ్​దేవరకొండ-దర్శకుడు పూరీ జగన్నాథ్​ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'లైగర్'​(liger release date). ఈ చిత్రంలో దిగ్గజ బాక్సర్​ మైక్​టైసన్​ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆయనతో చిత్రీకరణ చేసేందుకు చిత్రబృందం అమెరికా చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి షెడ్యూల్​ ప్రారంభించే ముందు పూరీ, దేవరకొండ(vijay devarakonda movies) కలిసి వెగాస్​​ నగరంలోని ఓ రెస్టారెంట్​లో ఎంజాయ్​ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నటి, నిర్మాత ఛార్మి ట్వీట్ చేశారు. "ఇంటెన్స్​ షెడ్యూల్​ ప్రారంభించడానికి ముందు వెగాస్​లో అబ్బాయిలు చిల్​ కొడుతున్నారు" అంటూ ఆమె రాసుకొచ్చారు. ఈ చిత్రంలో అనన్య పాండే(ananya pandey news) హీరోయిన్​. పాన్‌ ఇండియా స్థాయిలో ధర్మ ప్రొడక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ(vijay devarakonda and rashmika) మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా తర్ఫీదు పొందారు.

'ఊరికి ఉత్తరాన' ట్రైలర్

నరేన్‌ వనపర్తి, దీపాలి శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం'ఊరికి ఉత్తరాన'(ooriki utharana movie release date). విభిన్న ప్రేమ కథా చిత్రంగా సిద్ధమైన ఈ సినిమా నవంబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. 30 సంవత్సరాలు వయసు వచ్చినప్పటికీ పెళ్లికాని అబ్బాయి పాత్రలో హీరో నటించారు. "చదువు లేదు.. ఉద్యోగం లేదు.. మరి ఎందుకు వచ్చావు పెళ్లి చూపులకు. ప్రభుత్వ పథకాల్లో ఏ ఒక్కదానికి అర్హత లేదు" అంటూ పెళ్లి చూపులకు వెళ్లిన హీరోను పలువురు యువతులు రిజెక్ట్‌ చేస్తారు. ఈ క్రమంలోనే జీవితంలో ఏదైనా సాధించాలని భావించి చదువుకోవడం కోసం స్కూల్‌లో జాయినైన ఆయన ఎలా ప్రేమలో పడతాడు? వాళ్ల ప్రేమకు ముగింపు ఏమిటి? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈగల్‌ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకటయ్య వనపర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'హీరో' రిలీజ్​ డేట్

అశోక్‌ గల్లా కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతున్న చిత్రం 'హీరో'(hero movie 2021). శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం శనివారం ఉదయం అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 26న థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది. యూత్‌ఫుల్‌ లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సినిమాలో అశోక్‌కు జోడీగా నటి నిధి అగర్వాల్‌(nidhi agarwal upcoming movies) సందడి చేయనుంది. జగపతిబాబు, నరేశ్‌, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. జిబ్రాన్ స్వరాలు అందిస్తున్నారు. అమరరాజా మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

hero movie telugu
హీరో మూవీలో అశోక్

1997 విడుదలకు సిద్ధం

నవీన్‌ చంద్ర, కోటిలతో కలిసి ప్రధాన పాత్రలో నటిస్తూ.. మోహన్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం '1997'(1997 movie telugu). మీనాక్షి రమావత్‌ నిర్మాత. బెనర్జీ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా రిలీజ్​ డేట్​ను ఖరారు చేశారు. ఈ ఏడాది నవంబరు 26న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది చిత్రబృందం.

1997 movie telugu
1997 మూవీ

సత్యమేవ జయతే 2 ట్రైలర్

జాన్‌ అబ్రహాం, దివ్య ఖోస్లా కుమార్‌(john abraham satyameva jayate 2) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సత్యమేవ జయతే 2'(satyameva jayate 2 trailer). మిలప్‌ జావేరి దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన రెండో ట్రైలర్(john abraham satyameva jayate 2 trailer)​ విడుదలై అలరిస్తోంది. ఇందులో జాన్​ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. గతంలో వచ్చిన 'సత్యమేవ జయతే' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది సినిమా.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.