Malayalam actress lalitha died: ప్రముఖ మలయాళ నటి కేపీఏసీ లలితా(74) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. తన కుమారుడు ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సోషల్మీడియా ద్వారా నివాళులు అర్పిస్తూ తనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు. లలితా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
లలితా.. 1947 ఫిబ్రవరి 25న జన్మించారు. ఐదు దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన లలితా తన కెరీర్లో 550కు పైగా చిత్రాల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు భరతన్తో ఆమెకు వివాహమైంది. ఈయన చాలా కాలం క్రితం మరణించారు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు. తనయుడు సిద్ధార్థ్ కూడా నటుడు, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
![Legendary actor KPAC Lalitha passes away](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8_2302newsroom_1645578677_26.jpg)
![Legendary actor KPAC Lalitha passes away](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3_2302newsroom_1645578677_176.jpg)
ఇదీ చూడండి: టాలీవుడ్ క్రేజీ కాంబోలు.. ఫుల్ బిజీగా హీరోలు!