ETV Bharat / sitara

శరత్​ మరార్​​ చేతుల మీదుగా 'క్షీరసాగర మథనం' ట్రైలర్​

అనిల్ పంగులూరి దర్శకత్వం వహిస్తున్న 'క్షీరసాగర మథనం' సినిమా ట్రైలర్​ను గురువారం(జులై 29) విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రముఖ నిర్మాత శరత్​ మరార్​ ఈ ట్రైలర్​ను రిలీజ్​ చేయనున్నారని వెల్లడించింది.

author img

By

Published : Jul 28, 2021, 6:28 PM IST

Ksheera Sagara Madhanam movie trailer to be released by producer Sharat Marar
శరత్​ మరార్​​ చేతుల మీదుగా 'క్షీరసాగర మథనం' ట్రైలర్​

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సాఫ్ట్​వేర్​ సంస్థల్లో పని చేస్తున్న సాఫ్ట్​వేర్​ ఇంజినీర్స్​ రూపొందించిన చిత్రం 'క్షీరసాగర మథనం'. ప్రముఖ టెకీ అనిల్​ పంగులూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 6న థియేటర్లలో విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్​ను విడుదల చేసేందుకు చిత్రబృందం రంగం సిద్ధం చేసింది. ప్రముఖ నిర్మాత శరత్​ మరార్​ చేతుల మీదుగా గురువారం (జులై 29) రాత్రి 8.08 గంటలకు ఈ ట్రైలర్​ రిలీజ్​ కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అనిల్​ పంగులూరి మాట్లాడారు.

Ksheera Sagara Madhanam movie trailer to be released by producer Sharat Marar
నిర్మాత శరత్​ మరార్​ చేతుల మీదుగా ట్రైలర్

"మా చిత్రానికి మోరల్​గా ఎంతో మద్దతు ఇచ్చిన నిర్మాత శరత్​ కుమార్​ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఆయన చేతుల మీదుగా మా చిత్రమైన 'క్షీరసాగర మథనం' ట్రైలర్​ రిలీజ్​ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆగస్టు 6న సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నాం".

- అనిల్​ పంగులూరి, దర్శకుడు

మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల మధ్య భావోద్వేగాలను ప్రస్పుటిస్తూ రూపొందించిన చిత్రంలో మానస్​ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్​ కుమార్​ హీరోలుగా నటించారు. అక్షత సోనావని హీరోయిన్​గా నటించగా.. ప్రదీప్​ రుద్ర ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.

వీరితో పాటు చరిష్మా శ్రీకర్​, గౌతమ్​ శెట్టి, ప్రియాంత్​, మహేశ్​, అదిరే అభి, శశిధర్​ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్.వి.రమేశ్​ కుమార్, సంగీతం: అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం: సంతోష శానమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, పీఆర్వో: ధీరజ అప్పాజీ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి.

ఇదీ చూడండి.. 'క్షీరసాగర మథనం' పాట.. దర్శకుడు హరీశ్ శంకర్ ట్వీట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.