ETV Bharat / sitara

చెల్లి పాత్ర కోసం కీర్తిసురేశ్​ రెమ్యునరేషన్​ అంత? - bhola shankar 2021

'పెద్దన్న'(annaatthe keerthy suresh role) సినిమా ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇందులో సూపర్​స్టార్ రజనీకాంత్​ సోదరిగా నటించింది కీర్తిసురేశ్(keerthy suresh remuneration per movie)​. ఈ పాత్ర కోసం ఆమె.. స్టార్‌ హీరోయిన్లతో సమానంగా రెమ్యునరేషన్​ తీసుకోవడం కొందరిని విస్మయానికి గురిచేసింది! ఇంతకీ ఆమె ఎంత పారితోషికం తీసుకుందంటే?

keerthy suresh
కీర్తిసురేశ్​
author img

By

Published : Nov 11, 2021, 9:01 AM IST

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ఇటీవల 'పెద్దన్న'(annaatthe keerthy suresh role) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీపావళి సందర్భంగా నవంబర్‌ 4న విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. అయితే, ఇందులో రజినీకాంత్‌కు చెల్లెలుగా నటించిన కీర్తి సురేశ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో నటించినందుకుగానూ పారితోషికంగా ఆమె రూ.2 కోట్లు తీసుకున్నారట(keerthy suresh remuneration per movie). హీరోకి చెల్లెలు పాత్ర పోషించిన కీర్తి.. స్టార్‌ హీరోయిన్లతో సమానంగా పారితోషికం తీసుకోవడం పట్ల కొందరు విస్మయానికి గురవుతున్నారు. అయితే, ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ పాత్ర చాలా కీలకం. కథంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. అందుకే అంతమొత్తంలో పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సినిమాలో నటించడంతో కీర్తి సురేశ్‌ మరో అరుదైన అవకాశాన్ని సృష్టించుకున్నారు. అదేంటంటే.. కీర్తి తల్లి మేనక 1981లో విడుదలైన ‘నెట్రికన్‌’ చిత్రంలో రజినీకాంత్‌తో కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు ఆమెకు కూతురైన కీర్తి కూడా రజినీతో నటించారు. మరోవైపు తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 'భోళా శంకర్‌'(bhola shankar 2021) చిత్రంలోనూ ఆయనకు చెల్లెలుగా కీర్తి నటిస్తోంది. ఇక పెద్దన్న చిత్రం బాక్స్‌ ఆఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. ప్రస్తుత సినిమా కలెక్షన్‌ రూ.200 కోట్లకు చేరువలో ఉంది. తొలి రోజు రూ.70.19కోట్లు వసూలు చేయగా.. ఆరు రోజుల్లో మొత్తం 196.08 కోట్లు వసూలు చేసినట్లు సినిమా విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: చిరు 'భోళాశంకర్'​ సినిమా షూటింగ్​ షురూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.