(kaun banega crorepati 2021) బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం.. 'కౌన్ బనేగా కరోడ్‌పతి 13' షోలో కన్నీటి పర్యంతమయ్యారు. తన కొత్త సినిమా 'సత్యమేవ జయతే 2' ప్రచారంలో భాగంగా షోలో పాల్గొన్న అతడు.. కన్నీరు ఆపుకోలేకపోయారు. అందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ శుక్రవారం ప్రసారం కానుంది.
(satyameva jayate 2)'సత్యమేవ జయతే 2' హీరోహీరోయిన్లు జాన్ అబ్రహం, దివ్య ఖోస్లా కుమార్.. అమితాబ్ బచ్చన్ 'కౌన్ బనేగా కరోడ్‌పతి 13' షోలో సందడి చేశారు. తనదైన స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన జాన్.. సిక్స్ ప్యాక్ చూపించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత చేతి వేలిపై ఫుట్‌బాల్‌ను తిప్పి మెప్పించారు. ఆ తర్వాత 'ధూమ్' సినిమా అమితాబ్ ఇంటికి వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.
"నేను బైక్‌పై వస్తే.. అభిషేక్‌ను మాత్రం ఈ విషయంలో ప్రోత్సాహించవద్దంటూ నాతో అన్నారు. గుర్తుందా! కానీ అభిషేక్ కిందకు రాగానే 'వావ్ బైక్ చాలా బాగుందని మాట మార్చేశారు' అని" జాన్ అబ్రహం అప్పటి విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రోమో చివర్లో కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించారు. దానికి గల కారణం ఏంటనేది తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే.
-
#KBC13 mein aaye star John Abraham ne dikhaye apne dhamakedar stunts par kaunsi baat ki wajah se hui unki aankhein nam? Jaanne ke liye dekhiye #KaunBanegaCrorepati #ShaandaarShukravaar episode, 26th Nov, raat 9 baje, sirf Sony par. pic.twitter.com/mig7FwZPhI
— sonytv (@SonyTV) November 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#KBC13 mein aaye star John Abraham ne dikhaye apne dhamakedar stunts par kaunsi baat ki wajah se hui unki aankhein nam? Jaanne ke liye dekhiye #KaunBanegaCrorepati #ShaandaarShukravaar episode, 26th Nov, raat 9 baje, sirf Sony par. pic.twitter.com/mig7FwZPhI
— sonytv (@SonyTV) November 24, 2021#KBC13 mein aaye star John Abraham ne dikhaye apne dhamakedar stunts par kaunsi baat ki wajah se hui unki aankhein nam? Jaanne ke liye dekhiye #KaunBanegaCrorepati #ShaandaarShukravaar episode, 26th Nov, raat 9 baje, sirf Sony par. pic.twitter.com/mig7FwZPhI
— sonytv (@SonyTV) November 24, 2021
ఇవీ చదవండి: