ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ అరుదైన ఘనత సాధించింది. సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో 40 మిలియన్ల ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులు తనపై చూపిన ప్రేమ, ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు తను ఇన్‌స్టాలో షేర్ చేసిన పోస్టులకు సంబంధించిన వీడియో క్లిప్‌ను పంచుకుంది.
- View this post on Instagram
A bigggggggg 40 million sized hug to everyone 🤗 🎉🧡 thanks to @by.the.gram 4 this 🎥🌟
">
2017లో ఇన్‌స్టా ఖాతా తెరిచిన కత్రిన... తన వ్యక్తిగత, ప్రొఫెషనల్‌కు సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ఇందులో సినిమా షూటింగ్‌లు, డ్యాన్స్, వినోదాత్మక సన్నివేశాలు ఇలా ఎన్నో అనుభవాలను పోస్ట్ చేసింది.
బాలీవుడ్లో 'మైనే ప్యార్ క్యూన్ కియా'(2005), 'నమస్తే లండన్'(2007), వంటి రొమాంటిక్ కామెడీ చిత్రాలతో స్టార్డమ్ తెచ్చుకుంది కత్రిన. 'న్యూయార్క్'(2009) అనే చిత్రంలో ఆమె నటనకు గానూ ఉత్తమ మహిళా నటి విభాగంలో ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యింది.
కత్రిన నటించిన సినిమాల్లో 'ఏక్ థా టైగర్'(2012), 'ధూమ్ 3'(2013), 'బ్యాంగ్ బ్యాంగ్' వంటి చిత్రాలు అత్యధిక వసూళ్లు సాధించాయి. 2019లో విడుదలైన సల్మాన్ ఖాన్ మూవీ 'భారత్' లోనూ హీరోయిన్గా మెప్పించిందీ భామ.
ఇదీ చూడండి:అనుపమ్ ఖేర్ తల్లితో పాటు సోదరుడి కుటుంబానికి కరోనా