ETV Bharat / sitara

డిసెంబరులో సెట్స్​ పైకి కంగన 'తేజస్'​​ - kangana tejas movie updates

బాలీవుడ్​ హీరోయిన్​ కంగనా రనౌత్ నటిస్తున్న చిత్రం 'తేజస్​'. ఈ సినిమా షూటింగ్​ డిసెంబర్​లో ప్రారంభం కానున్నట్లు కంగన ట్విట్టర్​లో తెలిపింది.

Kangana Ranaut
కంగన
author img

By

Published : Aug 28, 2020, 12:46 PM IST

బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'తేజస్'​. ఈ సినిమాకు సంబంధించి కంగన ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ చిత్ర షూటింగ్​ డిసెంబర్​లో ప్రారంభం కానున్నట్లు ట్విట్టర్​లో ఫొటో పోస్ట్​ చేసింది. ఇందులో యుద్ధ విమానం తేజస్​ పక్కన ఆమె నిలబడి.. వైమానిక దళం యూనిఫామ్​ ధరించి కనిపించింది.

"డిసెంబరులో 'తేజస్'​ పైకి ఎగరనుంది. వైమానిక దళాల ధైర్య సాహసాలను చూపిస్తూ తెరకెక్కించే ఈ చిత్రంలో భాగమైనందుకు గర్వంగా ఉంది. జై హింద్​"

-కంగనా రనౌత్​, సినీ నటి

ఈ చిత్రంలో కంగన పైలట్​ పాత్రను పోషించనుంది. 'తేజస్'​ చిత్రానికి సర్వేశ్​ మెవారా దర్శకుడు. రోనీ స్క్రూవాలా నిర్మాత. 2021 ఏప్రిల్​లో సినిమా విడుదల కానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.