ETV Bharat / sitara

'ఐశ్వర్యా.. మీకోసం ప్రాణమైనా ఇచ్చేస్తా' - నీకోసం చనిపోతా అంటూ ఐశ్వర్యా రాజేశ్​కు పోస్ట్

నటి ఐశ్వర్యా రాజేశ్​కు నెట్టింట ఓ వింత అనుభవం ఎదురైంది. తాజాగా ఆమె ఓ ఫొటోను ఇన్​స్టాలో షేర్ చేయగా దానికి ఓ అభిమాని కామెంట్ పెట్టాడు. మీకోసం ప్రాణం కూడా ఇచ్చేస్తా అనగా.. దానికి ఐశ్వర్య స్పందించారు.

ఐశ్వర్య
ఐశ్వర్య
author img

By

Published : Jun 12, 2020, 8:32 PM IST

కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ గుర్తింపు పొందిన కథానాయిక ఐశ్వర్యా రాజేశ్‌. ఎటువంటి సినీ నేపథ్యం లేని ఆమె ఎంతో శ్రమతో చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. ఇటీవల 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'లో సువర్ణ పాత్రలో నటించి అందరి మెప్పు పొందారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్‌ చేశారు. లుక్‌ బాగుందని ఫాలోవర్స్‌ కామెంట్స్‌ చేశారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి ఐశ్వర్యపై తనకున్న ఇష్టాన్ని తెలుపుతూ "త్రిపురలో నేను మీకు వీరాభిమానిని. మీ కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తా. మీ నటన నాకెంతో ఇష్టం. ఈ ప్రపంచంలో మీకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. నిజంగా మీరంటే నాకు చాలా ఇష్టం అక్క" అని పోస్ట్‌ చేశాడు.

దీనికి ఐశ్వర్య స్పందిస్తూ.. అలాంటి మాటలు మాట్లాడొద్దని కోరారు. "ధన్యవాదాలు.. కానీ దయచేసి అలా మాట్లాడొద్దు. ఎదుటి వ్యక్తి కోసం చనిపోవడానికి మనం జీవించడం లేదు. నువ్వు సంతోషంగా ఉన్నానని చెబితే నాకు అదే చాలు. మరోసారి అలా మాట్లాడను అంటే (ప్రాణాలు తీసుకుంటా అని చెప్పడాన్ని ఉద్దేశించి..) నేనెప్పుడూ నీకు మంచి స్నేహితురాలిగా ఉంటా. జాగ్రత్త" అని ఆమె రిప్లై ఇచ్చారు.

ఐశ్వర్య, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన 'కాపే రణసింగం' విడుదలకు సిద్ధమౌతోంది. లాక్‌డౌన్‌ తర్వాత విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఐశ్వర్య చేతిలో 'టక్‌ జగదీష్‌', 'భూమిక', 'తిట్టం ఇరందు', 'ధృవ్‌ నక్షత్రం', 'ఇదు వెదళం సొల్లుమ్‌ కాధై', 'ఇదం పొరుల్‌ యేవల్‌' తదితర సినిమాలు ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.