ETV Bharat / sitara

హృతిక్ రోషన్​​ నా చిత్రంలో నటిస్తారేమో: నాని - nani double role movie

'శ్యామ్​సింగ్​రాయ్'(Shyam singharoy movie)​ సినిమా అన్ని భాషల వారికి నచ్చుతుందని అన్నారు హీరో నాని. ఈ చిత్రంలోని క్యారెక్టర్‌కు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు(shyam singharoy movie cast). ఇంకా ఈ సినిమా గురించి పలు ఆసక్తికర సంగతులను తెలిపారు. అవన్నీ ఆయన మాటల్లోనే..

cinema
సినిమా అప్డేట్స్​
author img

By

Published : Nov 9, 2021, 4:14 PM IST

పక్కింటి కుర్రాడిగా కనిపించే నటుల్లో నాని ఒకరు. భావోద్వేగం, కామెడీ ప్రధానంగా సాగే కథల్లో ఎక్కువగా కనిపించిన ఆయన తొలిసారి పూర్తిస్థాయి యాక్షన్‌ భరిత చిత్రంతో సందడి చేయనున్నారు(shyam singha roy trailer). 'టాక్సీవాలా' ఫేం రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో(Shyam singharoy movie director) నాని నటించిన సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ చిత్రం 'శ్యామ్‌ సింగరాయ్‌'. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది(shyam singha roy release date). ఈ నేపథ్యంలో ఇటీవల టైటిల్‌ గీతాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నాని.. మీడియా, అభిమానులతో ముచ్చటించారు. ఆ ఆసక్తికర సంగతులివీ..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మీ ప్రతి చిత్రంలోనూ ఏదో ప్రత్యేకత ఉంటుంది. 'శ్యామ్‌ సింగరాయ్‌' నుంచి ఏం ఆశించవచ్చు?

నాని: ఒకటి కాదు చాలా ఉన్నాయి. విడుదలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పుడే ఆ వివరాల్ని బయటపెట్టలేను. కానీ, ఒకటి మాత్రం నమ్మకంగా చెప్పగలను. సాంకేతికత వినియోగం (ముఖ్యంగా ఫోన్లు) విపరీతంగా పెరిగిన ప్రస్తుత రోజుల్లో సినిమాని పూర్తిస్థాయిలో ఆస్వాదించలేకపోతున్నాం. గతంలో ఎలా అయితే కథలో లీనమయ్యేవాళ్లమో ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో అలా కనెక్ట్‌ అవుతాం. ఏ పని ఉన్నా పక్కన పెట్టేస్తాం.

shyam singha roy
నాని

'శ్యామ్‌ సింగరాయ్‌'.. పాన్‌ ఇండియా స్థాయి చిత్రం అనిపిస్తుంది. హిందీలో విడుదలవుతుందా?

నాని: మీ దృష్టిలో పాన్‌ ఇండియా ఫిల్మ్‌ అంటే భారీ బడ్జెట్‌ అయి ఉండొచ్చు(nani pan india movie). కథే.. చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయికి తీసుకెళ్తుందనేది నా అభిప్రాయం. అన్ని భాషల వారు చూడదగ్గదే పాన్‌ ఇండియా చిత్రం. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ ఈ కోవకే చెందుతుంది. ‘టక్‌ జగదీష్‌’లాంటి చిత్రాలు తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉంటాయి కాబట్టి మిగతా భాషల్లో చూడకపోవచ్చు. ‘శ్యామ్‌ సింగరాయ్‌’కి అలాంటి పరిధులు లేవు. అందుకే దక్షిణాది భాషలన్నింటిలో విడుదల చేస్తున్నాం. ప్రస్తుతానికి హిందీలో విడుదల చేసే ఆలోచన లేదు. ఏమో చూద్దాం! ఏ హృతిక్‌ రోషనో ఈ చిత్రాన్ని హిందీలో చేసేస్తారనే నమ్మకం ఉంది.

ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కదా. వారి ప్రాధాన్యత ఏంటి?

నాని: ఈ సినిమాలోనే కాదు నా ప్రతి చిత్రంలోనూ కథానాయిక పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది(shyam singha roy heroine). సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్.. ముగ్గురు పాత్రలకు ఈ సినిమాలో చాలా ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురి, నా పాత్రే కాదు సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌కీ ప్రాధాన్యత ఉంటుంది.

shyam singha roy
కృతి శెట్టి, సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్

ఈ ముగ్గురిలో మీ అభిమాన నటి ఎవరు?

నాని: ఫలానా అని చెప్పలేను. ముగ్గురూ అభిమాన నటులే. ఒక్కో సన్నివేశంలో ఒక్కొక్కరు ఆకట్టుకున్నారు.

'శ్యామ్‌ సింగరాయ్‌' లుక్‌ కోసం ఎలాంటి కసరత్తులు చేశారు?

నాని: నటులు కేర్‌ తీసుకున్నంత మాత్రాన లుక్‌ అద్భుతంగా రాదు. స్క్రిప్టు వల్లే అది సాధ్యమవుతుంది. దర్శకులు, రచయితలు, సాంకేతిక బృందం కలిసి పాత్రని తీర్చిదిద్దితే లుక్‌లో ఇంపాక్ట్‌ కనిపిస్తుంది. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ లుక్‌ బాగుందంటే కారణం 24 విభాగాల కష్టమే.

shyam singha roy
శ్యామ్​ సింగ్​రాయ్​

ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. శ్యామ్‌ సింగరాయ్‌, వాసు.. ఈ రెండింటిలో ఏ పాత్ర సవాలుగా అనిపించింది?

నాని: రెండింటికీ ఒకేలా కష్టపడ్డా(nani double role movie). కానీ, శ్యామ్‌ సింగరాయ్‌ మనసుకి దగ్గరైంది. ఈ పాత్ర చాలా కొత్తగా, పవర్‌ఫుల్‌గా ఉంటుంది.

పోస్టర్లు చూస్తుంటే సత్యజిత్‌ రే జీవిత కథ ఆధారంగా వస్తోన్న చిత్రమనిపిస్తుంది..!

నాని: మీరు అనుకున్నట్టు ఏం కాదు(shyam singha roy movie story). కానీ, సత్యజిత్‌ రే గారితో పనిచేసిన కొందరు నటులు ఈ చిత్రంలో కనిపిస్తారు.

మళ్లీ స్పోర్ట్స్‌ డ్రామాలో ఎప్పుడు నటిస్తారు?

నాని: ఇప్పటికే రెండు (భీమిలి: కబడ్డీ జట్టు, జెర్సీ) సినిమాలు చేశాను (nani jersey movie cast). స్పోర్ట్స్‌ డ్రామాలో మరో చిత్రం చేశానంటే ఇలాంటి చిత్రాలకి అంబాసిడర్‌ అయిపోతానేమోనని బ్రేక్‌ ఇస్తున్నా. ఇంకో ఐదారేళ్లు అయితే ప్లేయర్‌గా కాదు కోచ్‌ పాత్రల్లో నటించాల్సి వస్తుంది (నవ్వులు).

shyam singha roy
జెర్సీ

మీ నుంచి భక్తి ప్రధాన చిత్రాలు, బయోపిక్స్‌ వచ్చే అవకాశం ఉందా?

నాని: హా. తప్పకుండా.

చిన్నపిల్లల కోసం సినిమా ఎప్పుడు చేస్తారు?

నాని: చిన్నపిల్లలతో నేను నటించినట్టుగా యువ నటుల్లో ఎవరూ నటించి ఉండరు. ‘ఈగ’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ తదితర చిత్రాల్లో బాల నటులు కనిపించారు. పిల్లలు ఎక్కువగా ఉండే చిత్రాన్ని త్వరలోనే ప్రకటిస్తా (నవ్వులు).

ఇదీచూడండి: సూర్య.. బయోపిక్​ల బాస్​.. నటనకు కేరాఫ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.