ETV Bharat / sitara

అందానికి అర్థం చెప్పిన అనుపమ పరమేశ్వరన్​ - అనుపమ పరమేశ్వరన్​

అందాల ముద్దుగుమ్మగా యువత మనసు కొల్లగొట్టేసిన నటి అనుపమ పరమేశ్వరన్​. అలాంటి అమ్మడు మాత్రం అందమంటే మనసు ప్రశాంతంగా ఉండటం అని చెప్పింది​. ప్రస్తుతం హీరో నిఖిల్​ సరసన '18పేజీస్'​ సినిమాలో నటిస్తోంది.

heroine anupama parameswaran
అనుపమ పరమేశ్వరన్
author img

By

Published : Nov 15, 2020, 1:30 PM IST

"కెమెరా ముందున్నంత వరకే నేను నటిని ఒక్కసారి ఇంట్లోకి అడుగు పెట్టానంటే పక్కింటి అమ్మాయిలాగే గడిపేస్తుంటా" అంటోంది హీరోయిన్​ అనుపమ పరమేశ్వరన్‌. 'అఆ'తో తెలుగు తెరపైకి అడుగుపెట్టిన ఈ మలయాళ తార.. అతి తక్కువ సమయంలోనే విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. అల్లరి పిల్లలా సరదా పాత్రలతో మెప్పిస్తూ అలరించింది.

"మరి సెట్లో ఎంతో ఉత్సాహంగా సందడి చేస్తూ కనిపించే అనుపమ.. చిత్రీకరణలు లేనప్పుడు ఇంట్లో ఎలా ఉంటుంది?' అని ప్రశ్నిస్తే.. తనదైన శైలిలో ఇలా బదులిచ్చింది.

"షూటింగ్‌లు లేకపోతే ఇల్లే నాలోకంగా మారిపోతుంటుంది. అసలు మేకప్‌ జోలికి పోను. రకరకాల హెయిర్‌ స్టైల్స్‌తో ప్రయోగాలు చేస్తుంటా. చాలా మంది 'ఇంట్లో ఉన్నప్పుడు అందం కోసం మీరెలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంటారు' అని అడుగుతుంటారు. వాస్తవానికి నేనెలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోను. నా దృష్టిలో అందమంటే పైపై మెరుగులు కాదు. లోపల మనసు ప్రశాంతంగా ఉండాలి. నేను నన్నిలా ఉంచుకోవడానికి ఎక్కువ ఇష్టపడతా" అని చెప్పింది.

త్వరలోనే తెలుగులో '18పేజీస్'​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది అనుపమ. దీంతో పాటే తమిళ, మలయాళంలోనూ పలు చిత్రాల్లోనూ నటిస్తోంది.

ఇదీ చూడండి : డీగ్లామర్​ రోల్స్​లో అలరించిన స్టార్​ హీరోయిన్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.