అగ్ర కథానాయిక తమన్నా, నటుడు సత్యదేవ్ జంటగా నటిస్తోన్న చిత్రం 'గుర్తుందా శీతాకాలం'. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. ఏప్రిల్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవల కర్ణాటకలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుందీ చిత్రం. రెండో షెడ్యూల్లో సెట్లోకి తమన్నా అడుగుపెట్టబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ సినిమా విశేషాలను వెల్లడించింది చిత్ర యూనిట్. జనవరి నెలాఖరు వరకు తదుపరి షెడ్యూల్ పూర్తి చేసి ఏప్రిల్ 1న సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపింది.
కన్నడలో విజయవంతమైన 'లవ్ మాక్టేల్' చిత్రానికి రిమేక్గా తెరకెక్కుతోందీ చిత్రం. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందించగా.. లక్ష్మీభూపాల్ సంభాషణలు రాస్తున్నారు.
ఇదీ చూడండి : క్లాస్లుక్లో సత్యదేవ్.. టైగర్ ష్రాఫ్ స్టంట్స్ అదుర్స్