ETV Bharat / sitara

విక్కీ-కత్రిన రిజిస్టర్ మ్యారేజ్.. గోప్యతకే మొగ్గు! ​ - katrina kaif vicky kaushal court marriage

బాలీవుడ్​ ప్రేమజంట కత్రినా కైఫ్-విక్కీ కౌశల్​ వచ్చే నెలలో రాజస్థాన్​లో పెళ్లి చేసుకోన్నున్నట్లు ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే అంతకంటే ముందే వచ్చే వారంలో ముంబయిలో రిజిస్టర్​ మ్యారేజ్​ చేసుకోనున్నట్లు ఈ జంటకు సంబంధించిన వర్గాలు తెలిపాయి. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు లీక్​ అవ్వకుండా ఉండటానికి వేడుకకు ఫోన్లను కూడా అనుమతించట్లేదని సమాచారం.

vikcy kaushal register marriage, విక్కీ కౌశల్​ రిజిస్టర్​ మ్యారేజ్​
విక్కీ కౌశల్​
author img

By

Published : Nov 25, 2021, 5:45 AM IST

బాలీవుడ్​ లవ్​బర్డ్స్​ కత్రినా కైఫ్​-విక్కీ కౌశల్​.. తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించనప్పటికీ రోజుకో వార్త ప్రచారంలోకి వస్తోంది. వచ్చే నెలలో రాజస్థాన్​లోని ఓ ప్రముఖ కోటలో వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారని అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు రాజస్థాన్​ వెళ్లక ముందే వచ్చే వారంలో ముంబయిలో రిజిస్టర్​ మ్యారేజ్​ చేసుకోనున్నట్లు ఈ జంటకు సంబంధించిన వర్గాలు తెలిపాయి.

తమ పెళ్లి ఫొటోలు సోషల్​మీడియాలో లీక్​ అవ్వకుండా ఉండేందుకు విక్కీ-కత్రిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. వారి పెళ్లికి ఫోన్లను అనుమతించకుండా ఉండే చర్యలు తీసుకుంటున్నారని చెప్పాయి.

విక్కీ-కత్రిన పెళ్లికి కరణ్​ జోహార్​, అలీ అబ్బాస్​ జాఫర్​, కబీర్​ ఖాన్​, రోహిత్​ శెట్టి, సిద్ధార్థ్​ మల్హోత్రా, కియారా అద్వాణి, వరుణ్​ ధావన్​, నటాషా దలాల్​ సహా పలువురు సెలబ్రిటీలు హాజరుకానున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: త్వరలో కత్రిన-విక్కీ పెళ్లి.. అందరి దృష్టి గోరింటాకుపైనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.