ETV Bharat / sitara

'నాన్న కన్నుమూసేలోపు ఆ సినిమా తీయాలనుకున్నా' - మహాసముద్రం మూవీ రివ్యూ

ఓ కొత్త దర్శకుడు తన తొలి సినిమా తీసి హిట్టుకొట్టడం... ఆపసోపాలు పడుతూ ఓ పర్వత శిఖరాన్ని చేరుకోవడంలాంటిదే. మరి రెండో సినిమా తీయడమంటే..అక్కణ్నుంచి మరో కొండ శిఖరానికి తాడుపైన నడవడం వంటిది. ఈ రెండు ఫీట్లనూ సమర్థంగా నిర్వహించి సత్తా చాటాడు యువదర్శకుడు అజయ్‌ భూపతి. 'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో చక్కటి విజయం సాధించిన అజయ్‌... మూడేళ్ల గ్యాప్‌ తర్వాత తన 'మహా సముద్రం'తోనూ ఆకట్టుకున్నాడు. ఈ రెండు సినిమాల వెనక తాను నడిచొచ్చిన గతుకుల బాటలోని అనుభవాల్ని ఇలా పంచుకుంటున్నాడు..

director ajay bhupathi life story
డైరెక్టర్ అజయ్ భూపతి
author img

By

Published : Oct 24, 2021, 7:41 AM IST

'అసలీ సినిమా రిలీజవ్వుద్దట్రా...!' - మా ఊళ్ళో నేను 'ఆర్‌ఎక్స్‌ 100' సినిమా తీస్తున్నప్పుడు అక్కడ చేరినవాళ్లు రోజూ వెటకారంగా అడిగే మాట ఇది! అసలే కోనసీమ ఆపైన ఆత్రేయపురం... ఇక సినిమాలపైన ఆ మాత్రం వెటకారం లేకుండా ఉంటుందా. మా ఊరికి సినిమా షూటింగులేమీ కొత్తకాదు. అలనాటి ఎన్టీఆర్‌ నుంచి రజినీకాంత్‌ దాకా ఇక్కడికి రాని స్టార్‌ లేడు. సినిమాల్లో కోనసీమ అందాలనగానే కెమెరా ఫ్రేమ్‌లో ఒక్కసారైనా ఆత్రేయపురం గోదారి తీరం కనపడాల్సిందే... ఇక్కడి 'లాకుల్ని' చూపించాల్సిందే. అంతగొప్ప స్టార్లను చూసిన మా ఊరివాళ్ల ముందు... ఏ స్టారూ లేకుండా కేవలం పదిపదిహేనుమంది అసిస్టెంట్‌లతో చిన్న కెమెరాలతో 'నేనూ సినిమా తీస్తున్నానహో' అని వెళితే వాళ్లలో ఆ మాత్రం వెటకారం తొంగిచూడదా..! 'ఆర్‌ఎక్స్‌ 100' షూటింగప్పుడూ అదే జరిగింది. కానీ సినిమా రిలీజయ్యాక ఊరంతా ఆ సందర్భాన్ని ఓ పండగలా చేసుకుంది. 'ఆయ్‌... ఈ డైరెట్రుది మావూరేనండీ!' అంటూ రావులపాలెం థియేటర్లలో తెగ హడావుడి చేసేశారు. ఇప్పుడు 'మహాసముద్రానికీ' అదే చేస్తున్నారు. వాళ్ల ఆనందానికి కేవలం నేను ఆ ఊరివాణ్ణి కావడం ఒక్కటే కారణం కాదు. నేను ఈ స్థాయికి రావడం కోసం పడ్డ పాట్లూ కార్చిన కన్నీళ్లూ వాళ్లకు బాగా తెలిసుండటం కూడా కారణమే! ఆత్రేయపురంలో మా కుటుంబాన్ని 'మిల్లోళ్లు' అనేవాళ్లు. మా ఊళ్ళో మిల్లుండేది కానీ... దానికీ మాకూ సంబంధం ఏమిటని నాకు పదహారేళ్ల దాకా తెలియదు. ఆ తర్వాతే తెలిసింది... ఆ పాత మిల్లును ఒకప్పుడు మా ఆరుగురు తాతయ్యలూ ఏర్పాటుచేశారనీ తర్వాతి తరంలో పంపకాలతో అది మా నాన్నవాళ్లకు దూరమైందనీ. అలాంటి పంపకాలలోనే నాన్నకు ఓ రెండున్నర ఎకరాలు వస్తే... వ్యవసాయం అంది రాక రొయ్యల చెరువులు పెట్టాడు. ఆ వ్యాపారంలోనూ భారీ నష్టం వచ్చి... అప్పులపాలయ్యాడు. ఓ రోజు... నాన్నకు అప్పిచ్చినాయన మా ఇంటి ముందుకొచ్చి పెద్దగా కేకలేయడం మొదలుపెట్టాడు. ఆ కోపంలో ఓ అనరాని మాటా అన్నాడు! అది విని నా గుండె భగ్గుమంది. పిడికిలి బిగించి వెంటనే అతణ్ని కొట్టేందుకు వెళ్లడానికి నేనేమీ సినిమా హీరోని కాదుకదా... ఉత్తిగా కన్నీళ్లు కుక్కుకుంటూ నిల్చుండిపోయాను. ఓ తండ్రి ఎంత సామాన్యుడైనా అతని కొడుకు దృష్టిలో హీరోనే! అలా తనను హీరోలా చూసే నా ముందూ అప్పులవాడు అంత మాట అనడం నాన్నను బాగా కదిలించి ఉండాలి... ఆయనకూ కన్నీరాగలేదు. తెలిసీతెలియని ఆ వయసులోనే... ఇంతటికీ కారణం డబ్బు లేకపోవడమే అన్న ఆలోచన నాలో నాటుకుపోయింది. ఎలాగైనా డబ్బు సంపాదించి నాన్నను నలుగురి ముందు గౌరవంగా నిలబెట్టాలనే లక్ష్యం ఏర్పడింది. దానికి నన్ను చేరువచేసే ఏకైక వ్యక్తి రామ్‌గోపాల్‌ వర్మ అని కలలు కనడం మొదలుపెట్టాను. మధ్యలో వర్మ ప్రస్తావన ఎందుకూ అనుకుంటున్నారేమో కదా... చెబుతాను.

ఒకే కలతో...

మా ఊళ్లో వర్మ ఫ్యాన్స్‌ ఎక్కువ. బడిలోనూ కాలేజీలోనూ ఏ ఇద్దరు ముగ్గురు సీనియర్లు కలిసినా సహజంగా 'అబ్బ... ఫలానా సినిమా ఏం తీశాడ్రా... ఆ కెమెరా యాంగిల్‌ ఏముందిరా!' అనుకుంటూ ఉండేవాళ్లు. దాంతో వర్మంటే ఎవరో తెలియకుండానే ఆయనకు ఫ్యాన్నయిపోయాను. నా బీకాం డిగ్రీని ఏదో బట్టీపట్టేసి గట్టేక్కేసినా... వర్మ సినిమాల్లోని ప్రతి సీన్‌నూ మనసుకు గట్టిగా పట్టించేశాను. కథలు రాయడమూ నేర్చుకున్నాను. డిగ్రీ అయ్యేనాటికి ఊళ్లో ఉపాధిలేక అమ్మానాన్నా హైదరాబాద్‌కు వచ్చి ఓ చిన్న టిఫిన్‌ సెంటర్‌ పెట్టారు. నేనూ అందులో పనిచేస్తూ సినిమా కలల్లో తేలిపోతుండేవాణ్ణి. అప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌ వచ్చిన విషయం కూడా తెలియక మన యాక్టర్‌లూ డైరెక్టర్లందరూ మద్రాసులోనే ఉన్నారనుకునేవాణ్ణి. ఓ రోజు చెప్పాపెట్టకుండా చెన్నై రైలెక్కేశాను. టికెట్టేమీ తీసుకోలేదు. అక్కడ స్టేషన్‌లో దిగి 'ఆర్జీవీ ఇల్లెక్కడ?' అంటే ఎవరు చెబుతారు! నాకు తోచిన చోటల్లా తిరిగితిరిగి సాయంత్రమయ్యాక దిగిన రైలే మళ్లీ ఎక్కాను. రెండు రోజులు తిండిలేక పీక్కుపోయి... ఇంటికొచ్చి పడ్డాను. నన్ను చూసి బెంబేలెత్తుతున్న అమ్మానాన్నలకు అప్పుడే మొదటిసారి నా సినిమా కలల గురించి చెప్పాను. ఆ పిచ్చిలో ఉన్నవాణ్ణి ఇక ఎంత చెప్పినా వినను అనుకున్నారేమో నాన్న 'నువ్వు సినిమాల కోసం ప్రయత్నించు కానీ... నీకు నేను ఏ సాయమూ చేయలేను. కాకపోతే... నువ్వు సంపాదించి నాకివ్వాలనీ కోరుకోను. నేను నీకు చేయగల సాయం అదొక్కటే' అన్నారు. ఆ తర్వాత మా కుటుంబం హైదరాబాద్‌లోనూ ఉండలేక సొంతూరు వెళ్లిపోయింది. నేను మాత్రం ఇక నా బతుకు ఇక్కడే అనుకుని ఉండిపోయాను.

director ajay bhupathi life story
డైరెక్టర్ అజయ్ భూపతి

సీరియల్‌లోకి...

సినిమాల్లో నాకు తెలిసినవాళ్లెవరూ లేరు... అందులోకి వెళ్లే దారేమిటో అంతుపట్టలేదు. ఓసారి రవి అనే పబ్లిసిటీ డిజైనర్‌ ఇంటర్వ్యూ ఒకటి ఓ మ్యాగజైన్‌లో వచ్చింది. ఎలాగోలా ఆయన నంబర్‌ సంపాదించి సహాయకుడిగా వస్తానని ప్రాధేయపడితే తన రూములోనే ఉండనిచ్చారు. ఆయన ద్వారా సీనియర్‌ డిజైనర్‌ ఈశ్వర్‌ స్నేహం దొరికింది. ఓసారి ఈశ్వర్‌ ఓ సీరియల్‌కు పనిచేస్తుంటే వెళ్లాను. బయట రిసెప్షన్‌లో వెయిట్‌ చేస్తూ ఉంటే... ఆ సీరియల్‌ నాయిక కారు దిగి నన్ను చూస్తూ వెళ్లారు. కాసేపటి తర్వాత లోపలి నుంచి పిలుపొచ్చింది. వెళితే అక్కడ నటుడు సురేశ్‌ ఉన్నారు. ఆయన నా వివరాలన్నీ అడిగారు. విషయమేంటో చెప్పకుండా ఓ డైలాగ్‌ కట్ట ఇచ్చి నేర్చుకుని రమ్మన్నాడు. అలాగే ప్రాక్టీస్‌ చేసి వెళ్లాను. వెళ్లాక నేను అబ్బాయి డైలాగ్స్‌ మాత్రం చెబితే చాలన్నారు. సురేశ్‌గారే అమ్మాయి పార్ట్‌ చెప్పారు. ఓ పేజీ పూర్తయ్యాక... నేను ఏ డైలాగూ చెప్పలేక నిల్చుండి పోయాను. సురేశ్‌గారు ఏమైందీ...? అని అడిగితే 'నేను ఒక్క పేజీ డైలాగే నేర్చుకున్నానండీ' అన్నాను. అంతే... చుట్టూ ఉన్నవాళ్లందరూ గొల్లుమన్నారు. సురేశ్‌గారు 'ఈ పాత్రలో నటించడానికి నీలాంటి అమాయకులే కావాలి. యూ ఆర్‌ సెలెక్టెడ్‌' అన్నారు. అలా సీరియళ్లలో నటించడం మొదలుపెట్టాను. ఇంటికి ఎంతోకొంత డబ్బు పంపుతుండేవాణ్ణి. మొత్తానికి టీవీలో బాగానే కుదురుకున్నా ఆర్జీవీ దగ్గర చేరాలన్న తపన మాత్రం పోలేదు. ఏడాదిన్నర తర్వాత సురేశ్‌గారి దగ్గరకెళ్లి 'మిసెస్‌ మంగతాయారు' నుంచి బయటకొస్తానని చెప్పాను. ఆయన అయిష్టంగానే నన్ను పంపారు. వర్మ ద్వారా అవకాశం వెంటనే దొరక్కపోవడం వల్ల 'రైడ్‌' అనే చిత్రానికి పనిచేశాను. ఆ తర్వాత రవితేజ 'వీర'లో అవకాశం వచ్చింది.

పేరున్న సహాయదర్శకుణ్ణి..!

ఎక్కడ పనిచేసినా నాకు అప్పగించినదాన్ని మరేదీ పట్టించుకోకుండా వేగంగా పూర్తిచేయడం నాకున్న అలవాటు. అప్పట్లో ఓ సీనియర్‌ కెమెరామన్‌ సెట్‌కు వస్తే... మొత్తం యూనిట్‌ అంతా ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసేది. నేను అవన్నీ పట్టించుకోకుండా పని మాత్రం చేస్తూ పోయేవాణ్ణి. కొద్దిరోజుల తర్వాత ఆ కెమెరామన్‌ పిలిచి 'నీకు పనితప్ప మరో లోకం తెలియట్లేదు. కచ్చితంగా పైకొస్తావ్‌!' అంటూ భుజం తట్టారు. అప్పటి నుంచీ నేను ఎంతమందిలో ఉన్నా గుర్తుపట్టి నా దగ్గరకొచ్చి మాట్లాడేవారు. పనికున్న గౌరవం ఏమిటో అప్పుడే తెలిసింది నాకు. అప్పట్లోనే నా ఒక్కగానొక్క చెల్లెలికీ పెళ్ళి చేయగలిగాను. అంత చిన్న వయసులోనే ఓ పెద్ద బాధ్యత పూర్తిచేయడమో... సినిమాల్లో మంచి పేరు తెచ్చుకోవడమో... లేదా వయసే కారణమో తెలియదు కానీ అప్పుడే ఓ అమ్మాయి ప్రేమలో పడ్డాను. రేపోమాపో తనతో ఏడడుగులు నడవడం ఖాయమనుకుంటున్న తరుణంలో... మేం విడిపోవాల్సి వచ్చింది. అంతే... ఇసుకలో పడ్డ చేపపిల్లలా విలవిల్లాడాను. ఆరునెలలు పిచ్చివాడిలా ఊళ్ళుపట్టుకు తిరిగాను. అప్పుడే... నేను నా కెరీర్‌ మొత్తం ఎదురుచూసిన వర్మ ఆఫీసు నుంచి సహాయకుడిగా రమ్మంటూ ఫోన్‌ వచ్చింది. నేనేమో 'సారీ... చేయలేనండీ!' అని పెట్టేశాను.

ఆ కసితోనే...

అప్పట్లో వర్మ దగ్గర సహాయదర్శకుడిగా ఉన్న నా స్నేహితుడు మంజు నేను వచ్చితీరాల్సిందేనని పట్టుబట్టాడు. ఓ దశలో విసిగి వేసారి ‘ఓ స్నేహితుడిలా చెబుతున్నాను... సినిమా తప్ప ఈ బాధ నుంచి నిన్ను ఇంకేదీ బయటపడేయలేదు. తర్వాత నీ ఇష్టం!’ అన్నాడు. ఏకళనున్నానో కానీ ఆ మాటల్తో హైదరాబాద్‌ వచ్చి... వర్మ దగ్గర చేరాను. అప్పట్లో ఆయన 'అటాక్‌' అనే సినిమా తీస్తున్నారు. నా బాధనంతా మరిచిపోవడానికని కసిగా పనిచేశాను. అదంతా గమనిస్తూ ఉన్న వర్మ 'నెక్ట్స్‌ ప్రాజెక్టు వీరప్పన్‌పైన చేస్తున్నాను. జాతీయస్థాయి సినిమా అది... నువ్వు అసోసియేట్‌గా ఉంటావా?' అన్నారు. నేను తటపటాయిస్తూ 'నేను పల్లెటూరివాణ్ణి సార్‌... ఇంగ్లిషు రాదు... ఆ ప్రాజెక్టుకు సరిపోనేమో' అన్నాను. ‘ఏం కాదు... చెయ్‌’ అంటూ భరోసా ఇచ్చారు. అంతేకాదు, ‘కిల్లింగ్‌వీరప్పన్‌’ సినిమాలో కొన్ని కీలకమైన సన్నివేశాల్ని నా చేతే తీయించారు. ఆ తర్వాత ‘వంగవీటి’ సినిమాకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అయ్యాను. మొత్తానికి ప్రేమవైఫల్యం బాధ నుంచి పూర్తిగా బయటపడి 'ఆర్‌ఎక్స్‌ 100' స్క్రిప్టు సిద్ధంచేసుకున్నాను.

RX 100 movie
ఆర్​ఎక్స్ 100 మూవీలో కార్తికేయ

మృత్యువు మెలమెల్లగా...

ఓ రోజు నాన్నకు ఆరోగ్యం బాగాలేదంటే ఊరెళ్లాను. డాక్టర్‌ దగ్గర చూపిస్తే రెండు కిడ్నీలూ దెబ్బతిన్నాయని చెప్పి... నెలకు ఆరుసార్లు డయాలసిస్‌ చేయించమన్నారు. ఇతరత్రా ఖర్చులన్నీ కలిపి దానికి ఇంచుమించు లక్ష రూపాయలవుతుందని చెప్పారు!

సహాయదర్శకుడిగా కాదుకదా... నేను దర్శకుణ్నయినా అంత డబ్బు వచ్చే పరిస్థితి లేదు. దాంతో నాకు తెలిసినవాళ్లందరి దగ్గరా చేతులు సాచడం మొదలుపెట్టాను. మరోవైపు, 'ఆర్‌ఎక్స్‌ 100' కోసం కొత్త హీరోనే కావాలని నేను పట్టుబడుతుండటం వల్ల నిర్మాతలెవరూ ముందుకురాలేదు. చివరికి నేను హీరోగా ఎంచుకున్న కార్తికేయ తానే నిర్మాతగా ఉంటానన్నాడు. అలా సినిమా మొదలుపెట్టానో లేదో నాన్న ఆరోగ్యం మరింతగా క్షీణించింది. మరో ఏడాది గడవడమూ కష్టమన్నారు వైద్యులు. ఆ విషయం ఎవరికీ చెప్పకుండా నాలోనే దాచుకున్నాను. నాన్న బతికున్నప్పుడే నా సినిమా పూర్తిచేయాలనుకుని పట్టుదలతో పనిచేశాను. పనిలో పడి ఆ విషాదాన్ని మర్చిపోతున్నా... అనుకోని తుపానులా దుఃఖం ముంచెత్తుతుండేది. మొత్తానికీ ఎలాగోలా సినిమా ముగించి ఊరికెళ్లి... నాన్నకు సినిమా చూపించాను. శారీరక బాధలు వేధిస్తున్నా ఆ రోజు ఆయన ఆనందానికి అంతేలేదు! ఆ ఆనందం వల్లనేమో ఆయన ఆరోగ్యం కాసింత నిలకడైంది. ఆర్‌ఎక్స్‌ 100 విజయంతోపాటు నా పెళ్ళి ముచ్చటా చూశాకే ఆయన కన్నుమూశారు!

నాన్న చనిపోయిన ఆరునెలల తర్వాతే 'మహా సముద్రం' పనులు మొదలుపెట్టాను. ముందుగా ఓ పెద్ద హీరోతో సినిమా మొదలుపెట్టినా... కొన్ని నెలలు గడిచాక ప్రాజెక్టు వదిలేయాల్సి వచ్చింది. ఆ తర్వాత శర్వానంద్‌, సిద్ధార్థ్‌... అందరూ సరిగ్గా కుదిరారు కానీ, కరోనా లాక్‌డౌన్‌ల కారణంగా మళ్లీ ఆగిపోవడం వల్ల ఖర్చులన్నీ తడిసిమోపెడయ్యాయి. ఆ బాధలన్నీ పంటికింద భరిస్తూనే ముందుకెళ్లాం. అలా-మొదలుపెట్టిన మూడేళ్లకు సినిమా విడుదల చేసినా... 'వీడేదో భిన్నంగా తీస్తాడు' అన్న అంచనాలని అందుకోగలిగాం. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వగలిగాం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.