AP cm jagan dilraju: ఆంధ్రప్రదేశ్లోని పదుల సంఖ్యలో సినిమా థియేటర్లు మూసివేత, టికెట్ రేట్లలో తగ్గింపు గురించి గత కొన్నిరోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ విషయమై పలువురు నటీనటులు స్పందిస్తున్నప్పటికీ ఎలాంటి మార్పులేదు. నిర్మాత దిల్రాజు సోమవారం ప్రెస్మీట్లో దీని గురించి మాట్లాడారు. త్వరలో ఏపీ సీఎం జగన్ను కలుస్తామని చెప్పారు.
"త్వరలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులను కలుస్తాం. అపాయింట్మెంట్ ఇస్తే ఏపీ సీఎం జగన్ను కలుస్తాం. కమిటీ ఏర్పాటు చేస్తే సమస్యల పరిష్కారం సులువవుతుంది. ఎవరూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయొద్దని మనవి. ముందుగా అసలు సమస్యలు ఏంటో చర్చిస్తాం. సమస్యలపై ఏపీ సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. మావి పెద్ద పెద్ద సమస్యలు కావు. ప్రేక్షకులకు మంచి సినిమాలు అందిచాలనేదే మా లక్ష్యం. సినీ పరిశ్రమను వివాదాస్పదం చేయొద్దని కోరుతున్నాం. పెద్ద సినిమాలు విడుదల చేయాల్సిందే. సినిమా విడుదలలలో కష్టమైనా, నష్టమైనా ముందుకే వెళ్లాలి" అని దిల్రాజు చెప్పారు.
ఇది చదవండి: ఏపీలో థియేటర్లు మూసేస్తుంటే ఏడుపొస్తుంది: ఆర్.నారాయణమూర్తి