మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య'కు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సినిమాకు తొలుత హీరోయిన్గా అనుకున్న త్రిష.. ఇంతకు ముందే తప్పుకోగా, ఆ స్థానంలో ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. ఇప్పడు ఆమె కూడా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కాజల్‌తో చిత్రీకరణ జరిపేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కరోనా పంజా విసిరింది. ఈ కారణంతో షూటింగ్‌లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో 'ఆచార్య' కోసం ఈ భామ ఇచ్చిన డేట్లు కాస్త వృథా అయిపోయాయని... ఇందువల్లే తప్పుకుందని ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంతన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
కాజల్ ప్రస్తుతం తమిళంలో యువహీరో ఉదయనిధి స్టాలిన్‌తో సినిమా చేసేందుకు అంగీకరించింది. ఇందుకోసం ఈమెకు భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చిరు సినిమా నుంచి తప్పుకోవడానికి ఇదీ ఓ కారణంగా కనిపిస్తోంది.