ETV Bharat / sitara

దీపావళికి మెగాహీరో సందడి.. సోనూ- నిధి ప్రేమ గీతం - nani meet cute update

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో హీరోలు నాని, వరుణ్ తేజ్​, నితిన్​, అక్షయ్ ​కుమార్​, సోనూసూద్ సినిమా వివరాలు ఉన్నాయి. అవన్నీ మీకోసం.. ​

cinema
సినిమా అప్డేట్స్
author img

By

Published : Aug 5, 2021, 6:20 PM IST

మెగాప్రిన్స్​ వరుణ్​ తేజ్​ హీరోగా బాక్సింగ్​ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం 'గని'. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఈ ఏడాది దీపావళి పండుగకు థియేటర్లలో సందడి చేస్తుందని ప్రకటించింది. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈ సినిమా కోసం నెలలపాటు కఠిన కసరత్తులు చేసి మరీ ప్రొఫెషనల్‌ బాక్సర్‌ అవతారంలోకి మారారు వరుణ్‌. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్​లుక్​ అభిమానులను ఆకట్టుకుంది.

gani
గని

నేచురల్​ స్టార్​ నాని(Natural Star Nani) నిర్మాణంలో యాంథాలజీ సినిమా 'మీట్​ క్యూట్​' తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఆయన సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆరుగురు నటులు, ఆరుగురు నటీమణులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరిలో సత్యరాజ్, ఆకాంక్ష సింగ్, అదాశర్మ, రోహిణి తదితరులు ఉన్నారు.

సోనూ సూద్‌, నిధి అగర్వాల్‌ జంటగా ఓ హిందీ గీతం రూపొందుతోంది. ఫరాఖాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం ఈ పాటకు సంబంధించిన టీజర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. 'సాత్‌ క్యా' అంటూ సాగే ఈ గీతాన్ని స్వీయ సంగీత దర్శకత్వంలో టోనీ కక్కడ్‌ రచించారు. ఫరాఖాన్‌ కొరియోగ్రఫీ. పూర్తి వీడియో ఆగస్టు 9న విడుదల కానుంది. 'ఓం శాంతి ఓం', 'హ్యాపీ న్యూ ఇయర్‌', 'మై హూనా' తదితర చిత్రాల దర్శకురాలే ఫరాఖాన్‌. కొరియోగ్రాఫర్, నటి, నిర్మాతగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారామె.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నితిన్ 'మాస్ట్రో'లోని ​'వెన్నెల్లో ఆడపిల్లా' పూర్తి పాట శుక్రవారం(ఆగస్టు 6) సాయంత్రం విడుదల కానుంది. హిందీ బ్లాక్​బస్టర్ 'అంధాధున్' రీమేక్​గా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నభా నటేష్, తమన్నా కీలకపాత్రల్లో నటించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. త్వరలో విడుదల తేదీపై స్పష్టత రానుంది.

maestro
మాస్ట్రో

అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన 'బెల్‌బాటమ్‌' ట్రైలర్‌ ప్రస్తుతం యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. బాలీవుడ్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో అక్షయ్‌ అండర్‌ కవర్‌ రా ఏజెంట్​గా కనిపించనున్నారు. ఇక ట్రైలర్‌ అంతా ఒకెత్తైతే.. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో ఒదిగిపోయిన లారా దత్తా నటన మరో ఎత్తు. అచ్చుగుద్దినట్టు ఇందిరా గాంధీ హెయిర్‌స్టైల్‌, చీరకట్టు, హావభావాలు పలకించారు 46ఏళ్ల నటి, మిస్‌ యూనివర్స్‌ లారా. ఇంత సహజంగా.. ఇందిరాగాంధీలా కనిపించేందుకు లారాదత్తాకు ప్రోస్థెటిక్‌ మేకప్‌ వేశారు. ఈమె లుక్​పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ లుక్​ను మీరూ చూసేయండి..

lara
లారా దత్తా
oh my dog
ఓ మై డాగ్​

ఇదీ చూడండి: నిహారిక భర్త చైతన్య న్యూసెన్స్ కేసు రాజీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.