ETV Bharat / sitara

'తెర'లేస్తోన్న వినోదం.. జనాలు ఇంతకు ముందులా వస్తారా?

author img

By

Published : Oct 2, 2020, 6:36 AM IST

అన్​లాక్ 5.0 ప్రక్రియలో భాగంగా థియేటర్లు తెరుచుకునేందుకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిింది. అయితే 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు తెరిస్తే జనాలు ఇంతకుముందులా వస్తారా? పెద్ద హీరోల చిత్రాలు ఇప్పటికిప్పుడు విడుదలవుతాయా? అనేది అందరికీ వస్తున్న ప్రశ్న.

cinema theatres reopen on october 15.. can people come normal?
సిినిమా థియేటర్

చిత్రసీమకు థియేటర్‌ ఓ దేవాలయం. సినీ అభిమానికి అదొక ఆనందనిలయం. అలాంటి థియేటర్‌ కొన్ని నెలలుగా మూగబోయింది. ప్రేక్షకుడ్ని థియేటర్‌ను కరోనా దూరం చేసింది. మునుపటిలా థియేటర్‌కు వెళ్లే రోజులు ఎప్పుడొస్తాయి? పెద్ద తెరపై సినిమాను ఎప్పుడు చూస్తాం? అంటూ సినీ అభిమాని ఆశగా ఎదురు చూసేలా చేసింది. ఎట్టకేలకు అన్‌లాక్‌ 5.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వినోదానికి తెరలేపింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే అక్టోబరు 15 నాటికి థియేటర్ల దగ్గర సందడి మొదలైనట్టే. ఈ నేపథ్యంలో సినిమాల విడుదల? థియేటర్ల నిర్వహణ ఎలా ఉండనుంది?

కరోనా కాలంలో థియేటర్లు మూతపడినా ప్రేక్షకుల వినోదానికి లోటు కనిపించలేదు. ఓటీటీ వేదికల ద్వారా పలు చిత్రాలు విడుదలయ్యాయి. 'అయినా సరే... థియేటర్‌ పంచే అనుభూతి వేరు' అన్నారు ప్రేక్షకులు. అందుకే థియేటర్ల పునః ప్రారంభంపై ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడగానే ఇటు పరిశ్రమలోనూ, అటు ప్రేక్షకుల్లోనూ ఉత్సాహం కనిపించింది. మరి ఈ నెల 15 నాటికి మన దగ్గర ఎన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి? మునుపటిలాగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉందా?మార్గదర్శకాల ప్రకారం సగం మందితోనే సినిమా ప్రదర్శన సాధ్యమేనా? శానిటైజేషన్‌, పరిశుభ్రత గురించి ఇతరత్రా ఏర్పాట్లతో పడే భారాన్ని ఎలా, ఎవరు భరిస్తారు? ఈ విషయాలన్నీ పరిశ్రమ వర్గాల్ని ఆలోచనలో పడేస్తున్నాయి.

చిన్న సినిమాలే

థియేటర్లు పునః ప్రారంభమైనా అగ్ర కథానాయకుల చిత్రాలు విడుదలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రేక్షకుల రాక ఏ స్థాయిలో ఉందో గమనించాకే దర్శకనిర్మాతలు ఆ సినిమాల్ని విడుదల చేసే యోచనలో ఉన్నారు. పక్కాగా సిద్ధమైన వాటిల్లో 'రెడ్‌', 'ఉప్పెన'... ఇలా ఒకట్రెండు మాత్రమే భారీ వ్యయంతో తెరకెక్కినవి. మిగిలినవన్నీ పరిమిత వ్యయంతో తీసినవే. అక్టోబరు 15 తర్వాత వాటిలోనే కొన్ని విడుదలయ్యే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రామ్‌గోపాల్‌ వర్మ 'కరోనా వైరస్‌' చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇలా ఎన్ని సినిమాలు ముందుకొస్తాయనేది చూడాలి. సంక్రాంతికి కానీ ప్రేక్షకుల సందడి థియేటర్ల దగ్గర కనిపించే అవకాశం లేదని నిర్మాతలు తమ సినిమాల్ని ఆ లక్ష్యంతో ముస్తాబు చేస్తున్నారు. ప్రేక్షకులు థియేటర్లకు రావడం మొదలైందంటే మాత్రం దసరా, దీపావళి, క్రిస్‌మస్‌లాంటి సీజన్లలోనే పెద్ద సినిమాలు వరస కడతాయి.

రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటాయో?

థియేటర్లు తెరచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం నుంచీ అనుమతులు లభించాల్సిందే. తమిళనాడులో మరో నెలపాటు థియేటర్లు తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా వైరస్‌ ఉద్ధృతిని పరిగణనలోకి తీసుకుని థియేటర్ల పునః ప్రారంభంపై ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. పలువురు దర్శకనిర్మాతలు, మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు, సింగిల్‌ థియేటర్ల యజమానులు థియేటర్ల పునః ప్రారంభానికి మద్దతు తెలుపుతున్నారు. మరి ప్రభుత్వాల నిర్ణయం మాటేమిటో చూడాలి.

అవీ రావొచ్చు

ఓటీటీ వేదికల్లో ఇదివరకే విడుదలైన సినిమాలు థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. 'కృష్ణ అండ్‌ హిజ్‌ లీల', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య', 'వి', 'పెంగ్విన్‌', 'భానుమతి రామకృష్ణ', 'జోహార్‌'తో పాటు మరికొన్ని అనువాద చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి. కొద్దిమంది నిర్మాతలు ఈ సినిమాల్ని థియేటర్లలో విడుదల చేసుకునేలా ఒప్పందాలు చేసుకున్నారు.

కష్టమైన రోజులు

"రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాకే థియేటర్లను తెరుస్తారు. స్థానిక కేసుల్ని దృష్టిలో ఉంచుకుని తెరవాలా? వద్దా? అనేది నిర్ణయిస్తారు. ప్రభుత్వాలకు ప్రజారోగ్యం ఎంత ముఖ్యమో, ఆదాయమూ అంతే. మాలో కొంతమంది వాదన ఏమిటంటే 'అన్నింటికీ అనుమతులు ఇస్తున్నారు? మమ్మల్నీ థియేటర్లని తెరుచుకోనివ్వచ్చు కదా' అంటున్నాం. నిర్మాతల్లోనూ విడుదల చేయగలమా? జనాలు వస్తారా?అనే భయాలు ఉన్నాయి. మొత్తంగా ఇవన్నీ కష్టమైన రోజులే" -డి.సురేశ్ బాబు, ప్రముఖ నిర్మాత

నిర్మాతలు సిద్ధంగా లేరు

"విమానాల్లో ప్రయాణానికి ఎలాంటి పరిమితులు లేవు. థియేటర్లలోనేమో యాభై శాతం మంది ప్రేక్షకులే ఉండాలంటున్నారు. థియేటర్లలోనైనా ఎప్పుడు పడితే అప్పుడు బయటికెళ్లొచ్చు, విమానాల్లో సాధ్యం కాదు కదా. వందశాతం ప్రేక్షకులతో థియేటర్లను నడిపినా పరిశ్రమకి 95 శాతం నష్టాలు వస్తుంటాయి. ఇక యాభై శాతం ప్రేక్షకులతో అంటే చాలా కష్టం. ప్రదర్శనకారుల పరిస్థితి ఏమిటంటే, ముందు ఏదో ఒక సినిమాని థియేటర్లో వేస్తే ప్రేక్షకులు రాకపోతారా అనుకుంటున్నారు. వాళ్ల నిర్ణయాన్ని కూడా స్వాగతించాల్సిందే. ప్రేక్షకుల్ని అలవాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో థియేటర్లు మాత్రం సిద్ధం అవుతున్నాయి. నిర్మాతలే సినిమాల్ని విడుదల చేయడానికి సిద్ధంగా లేరు" -సి.కల్యాణ్‌, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు

నగరాల్లో సిద్ధం

"రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఎలాంటి నిబంధనలతో ప్రదర్శనలు చేయాలో కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే మార్గదర్శకాలు వస్తాయి. అవి వచ్చాక, మూడు నాలుగు రోజుల్లో ప్రదర్శనకారులంతా సమావేశమవుతాం. యాభై శాతం సీటింగ్‌ సామర్థ్యంతో థియేటర్లను నడపడం సాధ్యమా కాదా? అంటే దేనికైనా ఆరంభమైతే కావాలి కదా. విడుదలకి సిద్ధంగా పది వరకు చిన్న సినిమాలున్నాయి. వాటిలో ఎంతమంది ధైర్యం చేస్తారనేది చూడాలి. వాటి వసూళ్లను దృష్టిలో ఉంచుకుని పెద్ద సినిమాల్ని విడుదల చేస్తాం. జనవరికైతే బాగా సినిమాలొస్తాయి. సామాజిక దూరం, పరిశుభ్రత, ఆట ఆటకీ శానిటైజేషన్‌ తదితర విషయాల్లో సిబ్బందికి సూచనలు ఇస్తున్నాం. ప్రేక్షకులు మాస్క్‌లతో రాలేదంటే వాళ్లకు ఉచితంగా మాస్క్‌లు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. నగరాల్లో థియేటర్లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. జిల్లాల్లోనూ పనులు మొదలయ్యాయి. శానిటైజింగ్‌తో ఖర్చులు పెరుగుతాయి. వాటిని మల్లీప్లెక్సులు భరిస్తాయి కానీ సింగిల్‌ థియేటర్లకు కష్టం. అలాగని టికెట్లు, క్యాంటీన్‌ ధరలు పెంచే అవకాశం లేదు. ఇలాంటి సమయంలో ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా" -సునీల్‌ నారంగ్‌, ప్రముఖ నిర్మాత, ప్రదర్శనకారుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.