ప్రముఖ బాలీవుడ్ సింగర్ యోయో హనీ సింగ్‌పై(హిర్దేశ్ సింగ్) గృహహింస చట్టం కింద కేసు నమోదైంది. లైంగికంగా, ఆర్థికంగా తనను హింసిస్తున్నాడని అతడి భార్య దిల్లీలోని తీస్ హజారీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హనీ సింగ్ ఆగస్టు 28 తేదీలోగా వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 2014లో ఓ రియాలిటీ షోలో షాలినీ తల్వార్ తన భార్య అంటూ పరిచయం చేసి అభిమానులను షాక్‌కు గురి చేశాడు.
2011లో సైఫ్ అలీఖాన్, దీపికా పదుకొణె నటించిన 'కాక్టైల్' సినిమాలోని 'అంగ్రేజీ బీట్' పాటతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హనీ సింగ్. ఆ తర్వాత పలు హిట్ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.
ఇదీ చూడండి: 'నారప్ప' లొకేషన్స్.. రామ్ కెరీర్లోనే రికార్డు ధర!