అమెజాన్ అడవులను మంటల్లో కాలుస్తున్న కొన్ని సేవా సంస్థ (ఎన్జీవో)లకు ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత లియోనార్డో డికాప్రియో ఆర్థిక సాయం చేసినట్లు చెప్పారు బొల్సొనారో.
"లియోనార్డో మంచి వ్యక్తా..? అమెజాన్ తగలబెట్టడానికి డబ్బును దానం చేశాడు" అని బ్రెజిల్‌లోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ వద్దకు వచ్చిన మద్దతుదారులతో ఈ మాటలు చెప్పారు జెయిర్ బొల్సొనారో.
![Brazil's President blames hollywood star hero for Amazon forest fires](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5233226_brazil222.jpg)
ఆరోపణలపై హీరో స్పందన...
బ్రెజిల్ అధ్యక్షుడి వ్యాఖ్యలను ఖండించాడు డికాప్రియో. " అమెజాన్ అడవుల పరిరక్షణకు బ్రెజిల్ ప్రజలతో కలిసి నేనూ ముందుంటాను" అని తెలిపాడు. ఏ సంస్థలకూ నేను ఆర్థిక సహాయం చేయట్లేదని చెప్పిన స్టార్ హీరో.. బ్రెజిల్‌లోని స్థానిక ప్రభుత్వం, శాస్త్రవేత్తలు, ప్రజలు, విద్యావేత్తలు, వివిధ కమ్యూనిటీ ప్రజలకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
గతంలోనూ అమెజాన్ పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని బొల్సొనారో విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సమ్మిట్‌లో అమెజాన్ అడవుల రక్షణ కోసం 20 మిలియన్ల డాలర్ల ఆర్థిక సాయం వచ్చినా దాన్ని తీసుకునేందుకు ఆయన తిరస్కరించారు.