ETV Bharat / sitara

'సుశాంత్​ ఏ ఆడిషన్​లోనూ విఫలమవ్వలేదు' - dil bechera

బాలీవుడ్​ హీరో సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​కు భావోద్వేగపు నివాళి అర్పించాడు దర్శకుడు ముఖేష్​ చబ్రా. సుశాంత్​కు సంబంధించిన ఆడిషన్లు సహా కొన్ని సన్నివేశాలను కలిపి వీడియోను ఆదివారం ఇన్​స్టాగ్రామ్​లో విడుదల చేశాడు.

Boy who never failed in auditions: Mukesh Chhabra's emotional tribute to Sushant Singh Rajput
'సుశాంత్​ ఏ ఆడిషన్​లోనూ విఫలమవ్వలేదు'
author img

By

Published : Jun 28, 2020, 3:13 PM IST

హీరో సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​కు సోషల్​ మీడియాలో భావోద్వేగపు నివాళి అర్పించాడు బాలీవుడ్​ దర్శకుడు ముఖేష్​ చబ్రా. ఆదివారం సుశాంత్​కు సంబంధించిన ఆడిషన్స్​తోపాటు వెండితెరపై కనబర్చిన అద్భుత ప్రదర్శనల వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేశాడు. సుశాంత్​ ఆడిషన్లలో ఉత్తమ ప్రదర్శన చేయడం సహా ఎందులోనూ విఫలమవ్వలేదని తెలిపాడు.

"సుశాంత్​ ​రాజ్​పుత్​.. ఏ ఆడిషన్​లోనూ విఫలమవ్వలేదు. తన నటనతో ఎంతోమంది హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాడు. సుశాంత్​కు నివాళిగా తన సినీప్రయాణంలో కొన్ని సన్నివేశాలతో వీడియోను రూపొందించాం".

- ముఖేష్​ ఛబ్రా, దర్శకుడు

సుశాంత్​ మరణం తర్వాత చిత్ర పరిశ్రమ ఓ మంచి నటుడ్ని కోల్పోయిందని.. తన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అభిప్రాయపడ్డాడు దర్శకుడు ముఖేష్​ చబ్రా. సుశాంత్​ నటించిన ఆఖరి చిత్రం 'దిల్​ బెచారా'కు దర్శకుడిగా వ్యవహరించాడు ముఖేష్​. ఈ సినిమా డిజిటల్​ వేదికగా త్వరలోనే విడుదల కానుంది.

ఇదీ చూడండి... రోహిత్ శర్మ సక్సెస్ సీక్రెట్ చెప్పిన ఇర్ఫాన్ పఠాన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.