ETV Bharat / sitara

బాలీవుడ్ నటులు.. వారి అదృష్ట సంఖ్యలు! - సైఫ్ అలీ ఖాన్ లక్కీ నెంబర్

కొంతమంది సెలబ్రిటీలు కొన్ని సంఖ్యలను అదృష్టంగా భావిస్తారు. అందుకే వారి రోజూవారి జీవితంలో ఆ నెంబర్లకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్స్​కు సంబంధించిన అదృష్ట సంఖ్యలేంటో చూద్దాం.

Bollywood
బాలీవుడ్
author img

By

Published : Jul 12, 2021, 5:32 PM IST

విజయం అంటే ఎవరికి మక్కువ ఉండదు చెప్పండి. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, బిజినెస్​మెన్ అందిరికీ సక్సెస్ కావాలనే ఉంటుంది. అందుకోసం వారు చాలా శ్రమిస్తుంటారు. ఎంత శ్రమించినా కొందరికి సక్సెస్ రాకపోవచ్చు. ఇలాంటి వారు కొందరు తమ తప్పులను తెలుసుకుంటూ ముందుకు వెళితే.. మరికొందరు అదృష్ట సంఖ్యలను నమ్ముతుంటారు. ఇలాంటి విషయంలో సెలబ్రిటీస్ ముందుంటారు. వారి కార్లు, బైక్​లు, మొబైల్ నెంబర్లను వారి వారి అదృష్ట సంఖ్యలు కలిసి వచ్చేలా తీసుకుంటూ ఉంటారు. అలా బాలీవుడ్​లోని కొందరు స్టార్ నటుల కారు నెంబర్ల వెనుక రహస్యమేంటో చూద్దాం.

అమితాబ్ బచ్చన్

Amitab bachan
కారుతో అమితాబ్

బాలీవుడ్ బిగ్​బీ అమితాబ్ బచ్చన్ ఓ తేదీని అదృష్ట సంఖ్యగా భావిస్తారు. అక్టోబర్ 11 బిగ్​బీ బర్త్​డే కాగా, ఆగస్టు 2ను తన రెండో పుట్టినరోజుగా చెప్పుకొంటుంటారు. ఓ యాక్సిడెంట్​లో మరణం అంచుల వరకు వెళ్లి మళ్లీ కోలుకున్న ఈ తేదీని అలా భావిస్తారీ సీనియర్ నటుడు. అందుకే ఆయన కారు నెంబర్​ల మొత్తం కూడితే 2 వచ్చేలా చూసుకుంటుంటారు. గతేడాది బిగ్​బీకి ఓ కారు బహుమతిగా లభించగా దాని నెంబర్​ 2882 అని స్పష్టంగా తెలుస్తోంది. వీటిని కూడితే మనకు 2 వస్తుంది. అయితే అమితాబ్ మొదటి కారు నెంబర్ కూడా ఇదే కావడం గమనార్హం.

షారుక్ ఖాన్

sharukh khan
షారుక్ కారులో గౌరీ ఖాన్, కరణ్ జోహర్

ఇలాంటి నమ్మకాలను బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ఎక్కువగా నమ్మరు. కానీ కారు నెంబర్ల విషయానికి వస్తే మాత్రం అదృష్ట సంఖ్యలను నమ్ముతారు. అందుకే ఆయన కార్ల నెంబర్లు 555 లేదా 40 కాంబినేషన్​తో ఉంటాయి. తన కారు నెంబర్ 555 కాగా ఈ-మెయిల్, మొబైల్ నెంబర్​లో కూడా ఇదే కాంబినేషన్ ఉంటుంది. షారుక్​తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది, నిర్మాణ సంస్థలోని సిబ్బంది ఫోన్ నెంబర్లలోనూ 555 ఉండటం గమనార్హం.

రణ్​బీర్ కపూర్

ranbeer kapoor
రణ్​బీర్ కపూర్

బాలీవుడ్ యువ నటుడు రణ్​బీర్ కపూర్​కు 8 అంటే చాలా ఇష్టం. తన ఫుట్​బాల్ జెర్సీ నెంబర్​తో పాటు చాలా సందర్భాల్లో ఈ సంఖ్యను తన అదృష్టంగా భావిస్తారు. రణ్​బీర్ తండ్రి రిషి కపూర్​కు కూడా ఎనిమిది అంటే చాలా ఇష్టమట. ఆయన భార్య నీతూ కపూర్​ పుట్టినరోజు జులై 8 కావడం ఇందుకు కారణమని అందరూ భావిస్తారు. అలాగే ఆయన కారు నెంబర్​ కూడా 8 కావడం గమనార్హం.

కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్

saif ali khan, kareena kapoor
తమ కారు వద్ద కరీనా, సైఫ్

బాలీవుడ్​ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ కారు నెంబర్ల విషయంలో ఓ సంఖ్యను నమ్ముతారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చింది కరీనా. తన పుట్టినరోజు సెప్టెంబర్ 21 అని.. అందుకే ఆ రెండు సంఖ్యల్ని కలిపితే వచ్చే 3 తన అదృష్ట సంఖ్యని వెల్లడించింది. దీంతో తన కారు నెంబర్ల మొత్తం కూడా 3గానే ఉంటుందని తెలిపింది. అలాగే తన భర్త సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు ఆగస్టు 16 కావడం వల్ల ఆ రెండు సంఖ్యల్ని కలిపితే వచ్చే 7ను ఆయన అదృష్టంగా భావిస్తారని పేర్కొంది. అందుకే సైఫ్ కారు నెంబర్లు మొత్తం 7 వచ్చేలా ఉంటాయని స్పష్టం చేసింది.

ఇవీ చూడండి: యాక్టర్​ సునీల్​ శెట్టి అపార్ట్​మెంట్​కు​ సీల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.