Balayya akhanda movie: నందమూరి బాలయ్య 'అఖండ' సినిమా అద్భుతం చేసింది. కరోనా రెండో దశ ప్రభావం, టిక్కెట్ రేట్ల వివాదం, షోల తగ్గింపు ఇలా పలు ఇబ్బందుల్ని ఎదుర్కొని అత్యంత విజయవంతంగా 50వ రోజులోకి అడుగుపెట్టింది. 103 కేంద్రాల్లో ఈ మార్క్‌ను అందుకుంది. ప్రస్తుతం ఈ ఘనత సాధించడమనేది గొప్ప విషయమనే చెప్పాలి.
ఎందుకంటే కరోనా మన జీవితాల్లోకి ప్రవేశించిన తర్వాత అన్ని రంగాలపై ఎఫెక్ట్ పడినట్లుగానే సినిమాలపై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని నెలల పాటు థియేటర్లు మూసివేశారు. ఆ తర్వాత వాటిని తెరిచినప్పటికీ ప్రేక్షకులు రావడం మాత్రం తగ్గిపోయింది. ఇలాంటి టైమ్‌లో వచ్చిన 'అఖండ'.. థియేటర్లలో ఆడియెన్స్‌కు పూనకాలు తెప్పించింది.
బాలయ్య విశ్వరూపం, బోయపాటి మాస్ డైరెక్షన్, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. బంపర్ హిట్ అందించాయి. దీంతో 50వ రోజులో అడుగుపెట్టే సమయానికి థియేటర్లలో గ్రాస్-నాన్ థియేట్రికల్ హక్కులు మొత్తం కలిపి రూ.200 కోట్లు వసూలు చేసింది. బాలయ్య కెరీర్లో ఈ మార్క్ అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి:
- 'అఖండ' 50డేస్ జాతర.. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా!
- బాలయ్య 'అఖండ' 50 డేస్.. విజయానికి కారణాలివే!
- నా ఎనర్జీ సీక్రెట్ అదే.. అందుకే ఇలా: బాలకృష్ణ
- పాకిస్థాన్‌లోనూ 'అఖండ' గురించి మాట్లాతున్నారు: బాలకృష్ణ
- 'అఖండ' తర్వాత మారిన బాలయ్య లెక్క.. రెమ్యూనరేషన్ భారీగా పెంపు!
- 'అఖండ'.. పాన్ వరల్డ్ సినిమా: హీరో బాలకృష్ణ
- Akhanda OTT Release: ఓటీటీలో 'అఖండ' రిలీజ్ ఎప్పుడంటే..
- డిఫరెంట్ స్టోరీస్‌తో వచ్చారు.. హ్యాట్రిక్ హిట్ కొట్టారు!