ETV Bharat / sitara

'జోకర్' గెటప్​లో అదరగొడుతున్న స్టార్ హీరో - 'జోకర్' గెటప్​లో ఆయుష్మాన్ ఖురానా

తనకు 'జోకర్', మనీ హైస్ట్ 'ఫ్రొఫెసర్' తరహా పాత్రలు చేయాలని ఉందంటూ యువహీరో ఆయుష్మాన్ ఖురానా చెప్పాడు. రచయితలు, దర్శకులు అలాంటి కథలతో తన దగ్గరకు రావాలని కోరాడు.

'జోకర్' గెటప్​లో అదరగొడుతున్న స్టార్ హీరో
ఆయుష్మాన్ ఖురానా
author img

By

Published : Jun 6, 2020, 8:06 PM IST

తనకు విలన్లు​ అంటే చాలా ఇష్టమని, అలాంటి పాత్రల్లో నటించాలని ఉందంటూ తన మనసులో మాట బయటపెట్టాడు బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా. ఇందులో భాగంగా హాలీవుడ్ పాత్ర 'జోకర్' వేషధారణలోని ఫొటోను ఇన్​స్టాలో పంచుకున్నాడు. అయితే ఇది ఓ అభిమాని తయారు చేసిందని, తన మనసు అర్థం చేసుకుని రూపొందించిన అతడికి కృతజ్ఞతలు తెలిపాడు. 'జోకర్' లాంటి పాత్రలు చేయాలని ఉందని రాసుకొచ్చాడు.

బాలీవుడ్​లో విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తున్న ఆయుష్మాన్.. విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నాడు. గతేడాది 'ఆర్టికల్ 15', 'డ్రీమ్​గర్ల్'తో అలరించాడు. ఈ సంవత్సరం 'శుభ్​మంగల్ జ్యాదా సావదాన్'తో అభిమానుల్ని పలకరించాడు. అమితాబ్​తో ఆయుష్మాన్ కలిసి నటించిన 'గులాబో సితాబో' సినిమా త్వరలో విడుదల కానుంది.

ఇవి చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.