ETV Bharat / sitara

సముద్ర గర్భంలో 'అవతార్​ 2' షూటింగ్​! - న్యూజిలాండ్​లో అవతార్​ 2 షూటింగ్​

జేమ్స్​ కామెరూన్​ తెరకెక్కించిన 'అవతార్​' చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్​ రూపొందుతోంది. వచ్చే వారం నుంచి న్యూజిలాండ్​లో 'అవతార్​ 2' చిత్రీకరణ మొదలవుతుందని ఆ చిత్ర నిర్మాత ప్రకటించారు. సముద్రగర్భంలో సాగే సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

'AVATAR 2' SHOOTING WILL STARTS FROM NEXT WEEK
సముద్ర గర్భంలో 'అవతార్​ 2' షూటింగ్​!
author img

By

Published : May 23, 2020, 9:15 AM IST

జేమ్స్‌ కామెరూన్‌ వెండితెర అద్భుతం 'అవతార్‌'కు సీక్వెల్‌ చిత్రాలు రాబోతున్నాయి. అందులో భాగంగా 'అవతార్‌ 2'ని 2021 డిసెంబరు 17న విడుదల చేస్తున్నట్లు ముందుగానే ప్రకటించింది చిత్రబృందం. కానీ కరోనా దెబ్బకు పరిస్థితులు మారిపోయాయి. షూటింగులు నిలిచిపోయాయి. సినిమా విడుదలలు ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల చిత్రపరిశ్రమలు షూటింగులకు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు 'అవతార్‌ 2' చిత్రీకరణనూ తిరిగి ప్రారంభించడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

'AVATAR 2' SHOOTING WILL STARTS FROM NEXT WEEK
అవతార్​

ఈ విషయాన్ని చిత్ర నిర్మాత జాన్‌ లాండూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. "మా అవతార్‌ కోసం ప్రత్యేకంగా వేసిన సెట్లు సిద్ధమయ్యాయి. వచ్చేవారంలో న్యూజిలాండ్‌లో చిత్రీకరణ చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం" అని పోస్ట్‌ చేశారు. సముద్ర గర్భం నేపథ్యంగా సాగే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రత్యేకంగా వేసిన బోటు సెట్లకు సంబంధించిన ఫొటోలను జాన్‌ పంచుకున్నారు.

ఇదీ చూడండి... జూన్​ నుంచి చిత్రీకరణలకు గ్రీన్​ సిగ్నల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.