ETV Bharat / sitara

'ఆ ఫ్లాట్​కు సుశాంత్ నుంచి చెల్లింపులు జరగలేదు'

సుశాంత్​ రాజ్​పుత్ ఆత్మహత్య కేసులో భాగంగా అతడి 15 కోట్ల లావాదేవీలపై ఈడీ విచారణ కొనసాగుతోంది. అయితే ముంబయి మలాద్​లో రూ.4.5కోట్ల విలువైన ఫ్లాట్​కు సుశాంత్ ఖాతా నుంచి వాయిదాలు చెల్లించినట్లు వార్తలు వచ్చాయి. అది అతడి స్నేహితురాలు అంకిత లోఖండేదని అంటున్నారు. తాజాగా దీనిపై స్పందించింది అంకిత.

సుశాంత్
సుశాంత్
author img

By

Published : Aug 15, 2020, 6:19 PM IST

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య కేసు విచారణ మొదలు పెట్టిన నాటి నుంచి ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. సుశాంత్‌కు సంబంధించిన రూ.15కోట్ల లావాదేవీలపై ఈడీ విచారణ చేపట్టింది. తాజాగా ముంబయిలోని మలాద్‌లో రూ.4.5కోట్ల విలువైన ఫ్లాట్‌కు సుశాంత్‌ ఖాతా నుంచి వాయిదాలు చెల్లించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయని వార్తలు వచ్చాయి. సుశాంత్‌ స్నేహితురాలు అంకిత లోఖండే ఆ ఫ్లాట్‌లో ఉంటున్నారు. దీంతో ఆమె స్పందించింది. అది తన ఫ్లాట్‌ అని, దానికి తానే ఈఎంఐలు చెల్లించుకుంటున్నానని, సుశాంత్‌ ఎప్పుడూ చెల్లించలేదని తెలిపింది. ఈ మేరకు వాయిదాలకు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌ వేదికగా పంచుకుంది.

అందులో ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌ డ్యాకుమెంట్లు, బ్యాంకు స్టేట్‌మెంట్‌, ఈఎంఐలు చెల్లిస్తున్నట్లు పత్రాలు కూడా ఉన్నాయి. "దీంతో వదంతులకు చెక్‌ పడుతుందని అనుకుంటున్నా. నేను చాలా పారదర్శకంగా ఉంటా. నా ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌, బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌, ఈఎంఐలు కట్టినట్లు స్టేట్‌మెంట్‌ అన్ని ఉన్నాయి. ఇంతకు మించి నేను ఏమీ చెప్పను" అంటూ ట్వీట్‌ చేసింది.

సుశాంత్‌ పేరు మీదున్న ఫ్లాట్‌లో అంకిత ఉంటోందని, ఆ ఫ్లాట్‌కు సంబంధించిన వాయిదాలు సుశాంత్‌ ఖాతా నుంచి చెల్లించారంటూ ఈడీ వర్గాలు తెలిపాయంటూ వార్తలు రావడం వల్ల గందరగోళం నెలకొంది. దీంతో అంకిత స్పందించింది. అయితే, సుశాంత్‌, అంకితల ఫ్లాట్స్‌ విషయంలో నెలకొన్న తికమక కారణంగానే ఈ వార్తలు వచ్చినట్లు తెలుస్తోంది. సుశాంత్‌ 403 నెంబర్‌ గల ఫ్లాట్‌ కొనుగోలు చేయగా, అంకిత నెం.404 ఫ్లాట్‌కు ఈఎంఐలు చెల్లిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.