ETV Bharat / sitara

బాలకృష్ణ కోసం కథ సిద్ధం చేసిన అనిల్! - బాలకృష్ణ తాజా వార్తలు

వరుస హిట్లతో జోరుమీదున్న దర్శకుడు అనిల్ రావిపూడి. లాక్​డౌన్ వల్ల దొరికిన ఖాళీ సమయాన్ని కొత్త కథలు సిద్ధం చేయడం కోసం ఉపయోగించుకుంటున్నారు. బాలయ్య కోసం కూడా ఓ కథను సిద్ధం చేసినట్లు సమాచారం.

అనిల్
అనిల్
author img

By

Published : May 26, 2020, 5:31 AM IST

లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణల నుంచి సినీతారలకు విరామం దొరికినా.. దర్శకులు మాత్రం కొత్త కథలను ముస్తాబు చేయడంలో తీరిక లేకుండా గడిపేస్తున్నారు. తాజాగా యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి కూడా ఓ కొత్త కథను సిద్ధం చేశారు. అది మరెవరి కోసమో కాదు.. నట సింహం నందమూరి బాలకృష్ణ కోసం.

నిజానికి అనిల్.. బాలయ్య 100వ చిత్రానికి దర్శకత్వం చేయాలని అప్పట్లో గట్టిగా ప్రయత్నించారు. కానీ, 'గౌతమీపుత్ర శాతకర్ణి' రూపంలో ఆ అవకాశాన్ని క్రిష్‌ కొట్టేశారు. కానీ, ఇప్పుడాయన మరోసారి బాలయ్య కోసం ఓ పవర్‌ఫుల్‌ కథను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. లాక్‌డౌన్‌ పూర్తయిన వెంటనే బాలకృష్ణకు కథ వినిపించేందుకు సిద్ధమౌతున్నారట అనిల్‌. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే 'ఎఫ్‌ 3' తర్వాత సెట్స్‌పైకి తీసుకెళ్లే చిత్రం బాలయ్యదే అవ్వాలని పట్టుదలతో ఉన్నారట.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.