ETV Bharat / sitara

బాలూ స్వరం దేవుడిచ్చిన వరం: అమితాబ్

author img

By

Published : Sep 27, 2020, 2:24 PM IST

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్ బచ్చన్​ నివాళులు అర్పించారు. జీవితంలో ఎంతో సాధించినా కూడా ఆయన నిరాడంబరంగా ఉంటారని తెలిపారు.

Big B remembers SPB: He was voice of great divinity and soul
ఎస్పీ బాలు నిరాడంబరమైన వ్యక్తి: అమితాబ్​

దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్ బచ్చన్​ సంతాపాన్ని ప్రకటించారు. ఎన్ని విజయాలు సాధించినా ఆయన ఎంతో నిరాడంబరంగా ఉంటారని కొనియాడారు. గతంలోనే బాలూను కలవడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

"ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోయారనే వార్త నా మనస్సును కలచివేసింది. ఆయనకు దేవుడు బహుమతి​గా ఇచ్చిన స్వరం మూగబోయింది. కరోనా సమయంలో మరో ఆణిముత్యాన్ని చిత్రపరిశ్రమ కోల్పోయింది. ఎంతో సాధించినా.. ఎప్పుడూ నిరాడంబరంగా ఉంటారు"

- అమితాబ్​ బచ్చన్​, బాలీవుడ్​ నటుడు

కరోనా సోకి ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కొన్ని రోజుల తర్వాత కొవిడ్​ పరీక్షల్లో నెగిటివ్​గా తేలింది. కానీ, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న బాలు.. ఎక్మో సాయంతో చికిత్స తీసుకుంటూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.

ఎస్పీబీ ఆరుసార్లు జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. 40 వేలకు పైచిలుకు పాటలు పాడారు. భారత ఉత్తమ పౌర పురస్కారాలైన పద్మశ్రీ, పద్మభూషణ్​లను దక్కించుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.